శుక్ర నక్షత్ర సంచారం 2026 : ఈ 3 రాశుల వారికి తిరుగులేని రాజయోగం - అదృష్టం మీ వైపే..!
ఆగస్టు 11, 2026న శుక్రుడు చంద్రుని హస్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర, చంద్రుల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ, ఈ నక్షత్ర పరివర్తనం మూడు రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, భౌతిక సుఖాలను అందించనుంది.
జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంపద, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, శ్రేయస్సు, ప్రేమ, అందానికి శుక్రుడే అధిపతి. జాతకంలో శుక్రుడి ప్రభావం శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో సకల సౌఖ్యాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తుంటారు. కాగా, ఈ శ్రావణ మాసంలో శుక్రుడి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది.

ప్రస్తుతం ఉత్తరఫల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్న శుక్రుడు, 2026 ఆగస్టు 11వ తేదీన చంద్రునికి చెందిన హస్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. సాధారణంగా జ్యోతిష్య సూత్రాల ప్రకారం శుక్రుడు, చంద్రుడి మధ్య శత్రుత్వ భావన ఉంటుంది. అయినప్పటికీ, హస్త నక్షత్రంలో శుక్రుడి సంచారం అన్ని రాశులపైనా ప్రతికూల ప్రభావం చూపదు.
పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నక్షత్ర మార్పుతో కొందరిలో స్వల్ప మానసిక అశాంతి పెరిగినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం అత్యంత ప్రయోజనకరమైన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారి జాతకాన్ని ఈ నక్షత్ర పరివర్తనం పూర్తిగా మార్చివేయనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం…..
కర్కాటక రాశి :
హస్త నక్షత్రంలో శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి భౌతిక సౌకర్యాలను విశేషంగా పెంచుతుంది. కుటుంబ జీవితంలో మధురమైన క్షణాలు చోటుచేసుకుంటాయి. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోయి, ధన ప్రవాహం పెరుగుతుంది.
పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఆశించిన పురోగతి లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు, శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి ఈ నక్షత్ర పరివర్తనం ధైర్యం, శౌర్యం, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. భాగస్వామ్య (పార్టనర్‌షిప్) వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు దక్కుతాయి. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పనితనం, సృజనాత్మకతకు కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను విశేషంగా ఆకర్షిస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు, రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మీ కెరీర్‌లో ఇది ఒక రకంగా కొత్త ఎత్తులకు చేరుకునే సువర్ణ సమయమని చెప్పవచ్చు.
మీన రాశి :
మీన రాశి వారికి శుక్రుడి హస్త నక్షత్ర ప్రవేశం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా మారుతుంది. మిత్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా నెరవేరని కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు దక్కడం లేదా ఉద్యోగోన్నతి (ప్రమోషన్) వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుని ప్రశంసల జల్లు కురిపిస్తారు. అదృష్టం మీ వైపు ఉండటంతో కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

