లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక లాభాలతో పాటు ఎన్నోలాభాలు పొందవచ్చు!
హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు విశేషమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని దీపారాధన చేయడం, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం, మంత్రాలు మరియు శ్లోకాలు జపించడం శుభప్రదంగా భావిస్తారు.
చాలామంది వివిధ పరిహారాలను పాటిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ముఖ్యంగా శుక్రవారం నాడు సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి.

శుక్రవారం సాయంత్రం కొన్ని పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. శుక్రవారం అనుగ్రహం కలుగుతుంది.
లక్ష్మీ మంత్రం
శుక్రవారం నాడు సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని “ఓం శ్రీ మహాలక్ష్మీ నమః” అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించండి. శతనామావళిని పారాయణం చేయొచ్చు.
పూలతో లక్ష్మీదేవిని ఆరాధించండి
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి, తెల్లటి పూలను సమర్పించండి. తామర పూలు దొరికితే వాటితో లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆ తర్వాత ధూప, దీప హారతిని లక్ష్మీదేవికి ఇవ్వండి.
సాయంత్రం దీపారాధన
శుక్రవారం నాడు సాయంత్రం పూజగదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవిని స్మరిస్తూ భక్తితో పూజించండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా దీపం పెట్టండి. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
తులసి మొక్క
తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబ ఆచారాలకు తగ్గట్టుగా తర్వాత పూజ చేయండి.
నైవేద్యం, దానం
లక్ష్మీదేవికి పాలు, పాయసం, పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే మీ సామర్థ్యానికి తగ్గట్టుగా అవసరమైన వారికి, పేదలకు ఆహారం, వస్త్రాలు వంటివి దానం చేస్తే విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ఐశ్వర్యానికి కూడా లోటు ఉండదు.
లక్ష్మీ శ్లోకాలు
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే
లక్ష్మీ బీజ మంత్రం
ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః
లక్ష్మీదేవి ధ్యాన శ్లోకం
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే
లక్ష్మీ ప్రార్థన
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే
ప్రసీద ప్రసీద
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


