ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం - ఈ 7 రాశులవారిపై లక్ష్మీదేవి కృపాకటాక్షాలు!
ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారంతో 7 రాశుల వారికి విపరీతమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో అపూర్వ పురోగతి దక్కనున్నాయి. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి తన కదలికలను మారుస్తూ ఎప్పటికప్పుడు అన్ని రాశుల వారి జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంటాడు. ప్రస్తుతం బృహస్పతి గ్రహం బుధుడు అధిపతిగా వ్యవహరించే ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆస్ట్రో పండితుల గణాంకాల ప్రకారం… అక్టోబర్ 31, 2026 వరకు గురువు ఈ నక్షత్రంలోనే కొనసాగుతాడు.

బుధుడి నక్షత్రంలో గురువు ప్రవేశించడం వల్ల ఈ రెండు గ్రహాల సంయుక్త అనుగ్రహం కొన్ని రాశుల వారికి విశేషంగా లభించనుంది. ముఖ్యంగా రాబోయే 48 రోజుల పాటు ఈ నక్షత్ర మార్పు వల్ల ఏడు రాశుల వారిపై లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని, వారికి ఊహించని ధన వర్షం కురుస్తుందని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఆ అదృష్ట రాశులు ఏవో, వారి జాతకాల్లో ఎలాంటి సానుకూల మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకోండి….
మేష రాశి :
ఈ రాశి జాతకులకు ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం అపారమైన ప్రయోజనాలను మోసుకొస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మార్కెట్‌లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కడమే కాకుండా, నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.
మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ గురు గ్రహ మార్పు వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు, ఉన్నత స్థానాలు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ సమయం ఉపశమనాన్ని ఇస్తుంది. సుదీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, చట్టపరమైన సమస్యలు మీకి అనుకూలంగా పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తయి మనశ్శాంతి లభిస్తుంది.
కన్యారాశి :
కన్యా రాశికి చెందిన విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది అత్యంత శుభ సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆశించిన రంగాలు లేదా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
తులా రాశి :
తులా రాశి వారికి ఈ గురు సంచారం సానుకూల పరిణామాలను తెస్తుంది. వృత్తి జీవితంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. శారీరక ఆరోగ్యానికి డీహైడ్రేషన్ ముప్పు ఉండకుండా తగినంత నీరు తాగడం, సరైన జీవనశైలి పాటించడం చాలా అవసరం.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని ప్రారంభించినా పూర్తి పట్టుదలతో, నమ్మకంతో పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ గురు గోచారం చాలా శుభప్రదంగా మారింది. వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో మధురంగా సాగుతాయి. అయితే, వాతావరణ మార్పుల దృష్ట్యా ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

