గురు తిరోగమనం - అక్టోబర్ నుంచి అదృష్టం వరించబోయే 6 రాశులివే!
దేవగురు బృహస్పతి రాశి మార్పు, తిరోగమన సంచారంతో 6 రాశుల వారికి అదృష్టం వరించనుంది. డిసెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రభావం వల్ల ఎవరెవరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి లభిస్తుందో చూడండి.
జ్యోతిష్య శాస్త్రంలో దేవగురుగా భావించే బృహస్పతి (గురుడు) కదలికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్రహాల అధిపతి అయిన గురుడు ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ…. అన్ని రాశుల వారి జీవితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతుంటాడు. ప్రస్తుతం బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలోనే కొనసాగనున్న గురుడు, అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

సింహ రాశిలోకి అడుగుపెట్టిన అనంతరం దేవగురు తన దిశను మారుస్తాడు. పంచాంగ గణనాల ప్రకారం… డిసెంబర్ 13న సింహ రాశిలోనే బృహస్పతి వక్ర గమనం (తిరోగమనం) ప్రారంభించనున్నాడు. సుమారు 121 రోజుల పాటు ఈ తిరోగమన స్థితిలోనే కొనసాగి, ఏప్రిల్ 13, 2027న తిరిగి రుజు మార్గంలోకి (సరియైన నడక) వస్తాడు. సంవత్సర చివర్లో చోటుచేసుకునే ఈ పెద్ద గ్రహ మార్పు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. అయితే ఈ వక్ర సంచారం వల్ల ముఖ్యంగా 6 రాశుల వారికి అన్ని వైపులా అద్భుతమైన ప్రయోజనాలు, శుభ యోగాలు కలగనున్నాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరిస్తున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు, వారికి లభించే ప్రయోజనాలు ఇవే…
మేష రాశి :
ఈ రాశి వారికి ఆఫీసు లేదా పని చేసే ప్రదేశంలో ఊహించని పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. గతంలో ఆగిపోయిన వ్యాపార ఒప్పందాలు, ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమై పుంజుకుంటాయి. వృథా ఖర్చులు అదుపులోకి వచ్చి, రావాల్సిన పాత బాకీలు లేదా చిక్కుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూల సమయం. కుటుంబంలో నడుస్తున్న గొడవలు సర్దుమణిగి, ఆరోగ్యం క్షీణించకుండా బాగుంటుంది.
కర్కాటక రాశి :
కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఉన్న పాత వివాదాలు ఈ సమయంలో పూర్తిగా పరిష్కారమవుతాయి. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఊహించని ఆర్థిక లాభాలు సొంతమవుతాయి. గతంలో నిలిచిపోయిన సొమ్ము తిరిగి మీ చేతికి వస్తుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపార సాహసాలు చేయడం మంచిది కాదు. విద్య, కెరీర్ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహ రాశి :
సింహ రాశి వారికి గురు తిరోగమనం కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని ఇస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలగడమే కాకుండా నిలిచిపోయిన నిధులు సమకూరతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. ఆఫీసులో మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సరైన ఆలోచనతో చేసే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
తులా రాశి :
తిరోగమన గురుడి ప్రభావంతో తులా రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో నూతన శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయం. నూతన పెట్టుబడి అవకాశాలు తలుపు తడతాయి. సోదరులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పించి ప్రశంసలు పొందుతారు. కోర్టు కేసులు లేదా న్యాయపరమైన చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసివచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులకు నూతన విషయాలు నేర్చుకోవడానికి మంచి అవకాశం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాల్లో అపోహలు తొలగిపోతాయి. వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనులు వేగంగా కొలిక్కి వస్తాయి.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. అయితే తొందరపడి పెద్ద మొత్తంలో రిస్క్ ఉండే పెట్టుబడులు పెట్టకూడదు. ఆఫీసులో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది.
చేయాల్సిన పరిహారాలు:
- ప్రతి గురువారం విష్ణుమూర్తిని ఆరాధిస్తూ, అరటి చెట్టుకు పూజ చేయాలి.
- గురువారం నాడు ఉపవాసం ఉండటం వల్ల జాతకంలో బృహస్పతి బలం పెరుగుతుంది.
- గురువారం పసుపు, పసుపు రంగు వస్త్రాలు, అరటిపండ్లను దానం చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

