గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే మరి కొన్ని రోజుల్లో బుధుడు, శుక్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేస్తారు. దీంతో శుభయోగం ఏర్పడబోతోంది. ఫిబ్రవరి 7న బుధుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

ఆ తర్వాత నాలుగు రోజులకు, అంటే ఫిబ్రవరి 11న శుక్రుడు కూడా శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
బుధ, శుక్రుల లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీడియా, మార్కెటింగ్, రైటింగ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ యోగం కారణంగా పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. చదువుతున్న వారికి, విదేశాల్లో పని చేస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
3.తులా రాశి:
తులా రాశి వారికి ఈ సమయం అద్భుతమైన సమయం. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సమతుల్యమైన జీవితాన్ని గడుపుతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాహనాలు, ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి.
4.ధనస్సు రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి ఈ సమయం అద్భుతమైన సమయం. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సమతుల్యమైన జీవితాన్ని గడుపుతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాహనాలు, ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి.
4.ధనస్సు రాశి:
{{/usCountry}}ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి వ్యాపారంలో పురోగతిని చూస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.
5.కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు ఉంటాయి. పని ప్రదేశంలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. సంతోషంగా ఉంటారు.