త్వరలో బుధ, శనిల ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు!

2026 సంవత్సరంలో ప్రధాన గ్రహాల సంచారంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఫిబ్రవరి 6, 2026న బుధుడు, శని 30 డిగ్రీల వద్ద ఉండడంతో ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు, అనేక లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?

Published on: Jan 15, 2026, 12:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పుల్ని కలిగిస్తుంది. 2026 సంవత్సరంలో ప్రధాన గ్రహాల సంచారంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఫిబ్రవరి 6, 2026న బుధుడు, శని 30 డిగ్రీల వద్ద ఉండడంతో ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడుతుంది.

త్వరలో బుధ, శనిల ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు అందిస్తుంది
త్వరలో బుధ, శనిల ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు అందిస్తుంది

యోగం కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు, అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతుందో తెలుసుకుందాం.

త్వరలో బుధ, శనిల ద్విద్వాదశ దృష్టి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు అందిస్తుంది

వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లను కూడా పొందుతారు. అనేక విధాలుగా లాభాలు ఉంటాయి.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకు రాబోతోంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది అద్భుతమైన సమయం. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ ఏకాగ్రత పెడతారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి రెండు గ్రహాల కలయికవల్ల ఏర్పడే ఈ యోగం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శని ప్రభావం వల్ల కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. ఏదైనా ప్రాపర్టీలు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే కూడా ఇది మీకు అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబ పెద్దల సపోర్ట్ ఉంటుంది. ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతారు.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈ గ్రహాల కారణంగా ఏర్పడే యోగం అద్భుతమైన ఫలితాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా ఈ సమయంలో సులువుగా పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More