త్వరలో లక్ష్మీ నారాయణ యోగం.. ఐదు రాశులకు అద్భుతమైన లాభాలు.. వాహనాలు, ప్రాపర్టీలతో పాటు ఎన్నో!

మరి కొన్ని రోజుల్లో బుధుడు, శుక్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేస్తారు. దీంతో శుభయోగం ఏర్పడబోతోంది. ఫిబ్రవరి 7న బుధుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత నాలుగు రోజులకు, అంటే ఫిబ్రవరి 11న శుక్రుడు కూడా శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. 

Published on: Jan 16, 2026, 16:30:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే మరి కొన్ని రోజుల్లో బుధుడు, శుక్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేస్తారు. దీంతో శుభయోగం ఏర్పడబోతోంది. ఫిబ్రవరి 7న బుధుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

త్వరలో లక్ష్మీ నారాయణ యోగం (pinterest)
త్వరలో లక్ష్మీ నారాయణ యోగం (pinterest)

ఆ తర్వాత నాలుగు రోజులకు, అంటే ఫిబ్రవరి 11న శుక్రుడు కూడా శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధ, శుక్రుల లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీడియా, మార్కెటింగ్, రైటింగ్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ యోగం కారణంగా పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.

2.కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. చదువుతున్న వారికి, విదేశాల్లో పని చేస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

3.తులా రాశి:

తులా రాశి వారికి ఈ సమయం అద్భుతమైన సమయం. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సమతుల్యమైన జీవితాన్ని గడుపుతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాహనాలు, ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి.

4.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి వ్యాపారంలో పురోగతిని చూస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది.

5.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు ఉంటాయి. పని ప్రదేశంలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. సంతోషంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More