Lucky Bamboo: మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి నిర్మాణానికి వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో చైనీస్ వాస్తు శాస్త్రమైన 'ఫెంగ్ షూయ్' (Feng Shui) పట్ల కూడా ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇంటీరియర్ డెకరేషన్‌లో భాగంగా పెంచుకునే 'లక్కీ బాంబూ' (Lucky Bamboo) మొక్క ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ, ఆఫీసు డెస్కు పైన కనిపిస్తోంది. కేవలం అందం కోసమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలామంది నమ్ముతుంటారు.

అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. లక్కీ బాంబూ కొనేటప్పుడు అందులో ఉండే కొమ్మల సంఖ్య చాలా ముఖ్యం. ఒక్కో సంఖ్యకు ఒక్కో అర్థం, ప్రభావం ఉంటుందని ఫెంగ్ షూయ్ నిపుణులు చెబుతున్నారు. సరైన సంఖ్యలో కొమ్మలు లేని మొక్కను పెట్టుకుంటే ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు.
కొమ్మల సంఖ్య.. కలిగే ఫలితాలు
మీరు కొనే లక్కీ బాంబూ మొక్కలో ఎన్ని కొమ్మలు ఉండాలో ఈ క్రింది వివరాలను చూసి నిర్ణయించుకోండి:
ఒక్క కొమ్మ: దీనిని ‘సింగిల్ స్టెమ్’ అని పిలుస్తారు. ఇది కొత్త ప్రారంభాలకు, ఆత్మవిశ్వాసానికి చిహ్నం. కెరీర్‌లో ఎదుగుదల కోరుకునే వారు, ఏకాగ్రత పెంచుకోవాలనుకునే విద్యార్థులు తమ స్టడీ టేబుల్ లేదా ఆఫీసు డెస్కుపై దీనిని ఉంచుకోవచ్చు.
రెండు కొమ్మలు: ఇది ప్రేమకు, భాగస్వామ్యానికి సంకేతం. కొత్తగా పెళ్లయిన వారు లేదా దంపతుల మధ్య అనురాగం పెరగాలనుకునే వారు దీనిని బెడ్రూమ్‌లో ఉంచుకోవడం మంచిది.
మూడు కొమ్మలు: ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన సంఖ్య. ఇది సంతోషం, ఆరోగ్యం మరియు దీర్ఘాయువును సూచిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత కోసం దీనిని లివింగ్ రూమ్‌లో ఉంచాలి.
ఐదు కొమ్మలు: ఐదు సంఖ్య సంపదకు, విజయానికి గుర్తు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశించే వారు, వ్యాపారంలో పురోగతి సాధించాలనుకునే వారు ఐదు కొమ్మలున్న బాంబూను ఎంచుకోవాలి.
{{/usCountry}}ఐదు కొమ్మలు: ఐదు సంఖ్య సంపదకు, విజయానికి గుర్తు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశించే వారు, వ్యాపారంలో పురోగతి సాధించాలనుకునే వారు ఐదు కొమ్మలున్న బాంబూను ఎంచుకోవాలి.
{{/usCountry}}ఎనిమిది మరియు పది కొమ్మలు: ఎనిమిది కొమ్మలు ఉంటే అపారమైన సమృద్ధిని, పది కొమ్మలు ఉంటే పరిపూర్ణతను సూచిస్తాయి.
గమనిక: ఫెంగ్ షూయ్ నిపుణుల ప్రకారం నాలుగు కొమ్మలు ఉన్న మొక్కను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. చైనీస్ సంప్రదాయంలో 'నాలుగు' సంఖ్య మరణాన్ని సూచిస్తుంది, కాబట్టి దీనిని అశుభంగా భావిస్తారు.
ఏ దిశలో పెడితే అదృష్టం?
మొక్కను తెచ్చి ఎక్కడో ఒకచోట పెట్టేయడం కంటే, సరైన దిశలో ఉంచడం వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
తూర్పు దిశ (East): ఇంటి లివింగ్ రూమ్ లేదా హాల్లో తూర్పు వైపు ఈ మొక్కను ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
ఆగ్నేయం లేదా దక్షిణం (South-East/South): ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి, ఐశ్వర్యం పెరగడానికి ఈ దిశలు ఉత్తమం. ఆఫీసుల్లో దక్షిణ దిశలో ఉంచడం వల్ల పనిలో గుర్తింపు లభిస్తుంది.
బెడ్రూమ్ నియమాలు: బెడ్రూమ్‌లో ఉంచేటప్పుడు బాంబూ కొమ్మలను ఒక ఎర్రటి రిబన్‌తో కట్టాలి. నీటితో నిండిన గాజు జార్‌లో ఉంచడం వల్ల దంపతుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది.
సంరక్షణ కూడా ముఖ్యమే
కేవలం మొక్కను తెచ్చి పెట్టడమే కాదు, దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్క ఎండిపోయినా లేదా కుళ్లిపోయినా వెంటనే దానిని తీసేయాలి. వారానికి ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. నేరుగా ఎండ తగిలే చోట కాకుండా, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచితే మొక్క ఏపుగా పెరుగుతుంది. పచ్చగా కళకళలాడే లక్కీ బాంబూ మీ ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది.