Gajalakshmi Yogam: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల మార్పు వలన శుభ యోగాలు ఏర్పడితే, కొన్నిసార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, మే నెలలో చాలా శక్తివంతమైన రాజయోగం ఒకటి ఏర్పడబోతోంది. ఇది చాలా రాశుల వారికి ప్రయోజనాలను తీసుకు వస్తోంది. మే 14న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గురువు మిథున రాశిలో సంచారం చేస్తుండడంతో, ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో శుక్ర, గురువుల సంయోగం గజలక్ష్మి రాజయోగానికి దారి తీస్తుంది.
గజలక్ష్మి రాజయోగం
ఈ రాజయోగం జూన్ 2 వరకు ఉంటుంది. ఇది చాలా అరుదైన యోగం. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు, ఆర్థిక పరంగా లాభాలు, సమాజంలో గౌరవ మర్యాదలు. ఇలా అనేక విధాలుగా మార్పులను చూడొచ్చు. మరి ఈ యోగం వలన ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గజలక్ష్మి రాజయోగం.. 4 రాశుల వారికి అనేక ప్రయోజనాలు.. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారా?
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఘడియలు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జీవితంలో చక్కటి సానుకూల మార్పులను చూస్తారు.
2.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. పురోగతిని చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషం కూడా పెరుగుతుంది.
3.తులా రాశి:
{{/usCountry}}ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. పురోగతిని చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషం కూడా పెరుగుతుంది.
3.తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి ఈ రాజయోగం అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. పని ప్రదేశంలో చక్కటి మార్పులను చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
4.మీన రాశి:
మీన రాశి వారికి శుభ సమయం. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.