సూర్యుడు మండిపోతున్నా 4 రాశుల జాతకం వెలిగిపోతోంది! గజలక్ష్మి యోగం తెచ్చిన రాజభోగం.. డబ్బు, అదృష్టం, వివాహం ఇలా ఎన్నో!

Gajalakshmi Yogam: గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడడానికి చూస్తూ ఉంటాం. మే నెలలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు?

Published on: Apr 22, 2026, 12:00:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gajalakshmi Yogam: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల మార్పు వలన శుభ యోగాలు ఏర్పడితే, కొన్నిసార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Gajalakshmi Yogam: సూర్యుడు మండిపోతున్నా 4 రాశుల జాతకం వెలిగిపోతోంది! గజలక్ష్మి యోగం తెచ్చిన రాజభోగం (pinterest)
Gajalakshmi Yogam: సూర్యుడు మండిపోతున్నా 4 రాశుల జాతకం వెలిగిపోతోంది! గజలక్ష్మి యోగం తెచ్చిన రాజభోగం (pinterest)

జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, మే నెలలో చాలా శక్తివంతమైన రాజయోగం ఒకటి ఏర్పడబోతోంది. ఇది చాలా రాశుల వారికి ప్రయోజనాలను తీసుకు వస్తోంది. మే 14న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గురువు మిథున రాశిలో సంచారం చేస్తుండడంతో, ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో శుక్ర, గురువుల సంయోగం గజలక్ష్మి రాజయోగానికి దారి తీస్తుంది.

గజలక్ష్మి రాజయోగం

రాజయోగం జూన్ 2 వరకు ఉంటుంది. ఇది చాలా అరుదైన యోగం. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు, ఆర్థిక పరంగా లాభాలు, సమాజంలో గౌరవ మర్యాదలు. ఇలా అనేక విధాలుగా మార్పులను చూడొచ్చు. మరి ఈ యోగం వలన ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గజలక్ష్మి రాజయోగం.. 4 రాశుల వారికి అనేక ప్రయోజనాలు.. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారా?

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి గజలక్ష్మి రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ ఘడియలు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జీవితంలో చక్కటి సానుకూల మార్పులను చూస్తారు.

2.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. పురోగతిని చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషం కూడా పెరుగుతుంది.

3.తులా రాశి:

తులా రాశి వారికి ఈ రాజయోగం అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. పని ప్రదేశంలో చక్కటి మార్పులను చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

4.మీన రాశి:

మీన రాశి వారికి శుభ సమయం. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More