...
...
Next Story

మహాశివరాత్రి తర్వాత ఇంటికి వీటిని తీసుకు వస్తే ధనవంతులు అవ్వచ్చు.. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి!

ప్రతి ఏటా మహాశివరాత్రి మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఆ రోజు శివపార్వతులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, శివరాత్రి తర్వాత మీరు ధనవంతులైపోవాలంటే ఖచ్చితంగా శివరాత్రి తర్వాత ఇంటికి వీటిని తీసుకురండి.

Published on: Feb 11, 2026, 08:00:36 IST
Advertisement

మహాశివరాత్రి ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటి. మహాశివరాత్రి నాడు భక్తితో శివుని ఆరాధిస్తారు. అలాగే శివాలయాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. శివరాత్రి నాడు శివుడిని పూజించి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులను, బిల్వపత్రాలను సమర్పిస్తారు. చాలామంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.

మహాశివరాత్రి 2026

శివరాత్రి తర్వాత ఈ పవిత్రమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోండి (pinterest)
శివరాత్రి తర్వాత ఈ పవిత్రమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోండి (pinterest)

ప్రతి ఏటా మహాశివరాత్రి మాఘ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఆ రోజు శివపార్వతులను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే శివరాత్రి నాడు అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. శివరాత్రి తర్వాత మీరు ధనవంతులైపోవాలంటే ఖచ్చితంగా శివరాత్రి తర్వాత ఇంటికి వీటిని తీసుకురండి. దీంతో ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది. సంపదకు లోటు ఉండదు. శివరాత్రి తరువాత ఇంటికి వీటిని తెస్తే మీ జీవితమే మారిపోతుంది.

శివరాత్రి నాడు అభిషేకం

శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయాలంటే ముందు ఒక కుండతో నీళ్లు తెచ్చుకుని శివుడికి సమర్పించండి. ఆ తర్వాత పాలు సమర్పించండి. ఇలా చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆర్థికపరంగా దృఢంగా ఉండొచ్చు. ఆ తర్వాత పెరుగును సమర్పించండి. పెరుగును సమర్పిస్తే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి, మానసికంగా కూడా బాగుంటుంది.

ఆ తర్వాత శివలింగానికి తేనెను సమర్పించండి. దీంతో వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారు శివలింగానికి నెయ్యిని సమర్పించాలి. అలాగే నల్ల నువ్వులను సమర్పిస్తే ప్రతికూల శక్తి నుంచి బయటపడవచ్చు, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇలా శివరాత్రి నాడు శివుడికి సమర్పిస్తే శివపార్వతుల అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

శివరాత్రి తర్వాత ఈ పవిత్రమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోండి

1.బిల్వ ఆకులు:

పార్వతీ దేవికి సమర్పించిన గాజులు, కుంకుమ వంటి వాటిని కూడా ఇంటికి తెచ్చుకోండి. వీటిని మీరు ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పార్వతీ దేవి అనుగ్రహంతో అదృష్టం మారిపోతుంది. దీర్ఘ సుమంగళిగా ఆనందంగా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది.

3.అభిషేకం చేసిన నీరు:

అభిషేకం చేసిన నీటిని తీసుకువచ్చి ఇంట్లో చల్లండి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks