2026 ఫిబ్రవరిలో వచ్చే ఏకాదశులు: ఫిబ్రవరిలో ఏకాదశులు ఎప్పుడు వచ్చాయి? విజయ, అమలకి ఏకాదశుల తేదీ, శుభ సమయం, పరిహారాలు!

2026 ఫిబ్రవరిలో వచ్చే ఏకాదశులు: ఏకాదశి ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. మొదట శుక్ల పక్షంలో, తరవాత ఏకాదశి కృష్ణ పక్షంలో వస్తుంది. ఏకాదశి ఉపవాసం ముఖ్యమైనది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి నాడు నిష్టగా ఉపవాసాన్ని పాటిస్తే, విష్ణుమూర్తి ఖచ్చితంగా తన ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు.

Published on: Jan 31, 2026, 15:00:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిబ్రవరిలోని ఏకాదశులు 2026: ఈ ఏడాది మొదటి నెల పూర్తి కాబోతోంది. ఫిబ్రవరి రాబోతోంది. ఫిబ్రవరిలోకి అడుగు పెట్టబోతున్నాము. ఏకాదశి ప్రతి నెలా రెండు సార్లు వస్తుంది. మొదట శుక్ల పక్షంలో వస్తుంది. తరవాత ఏకాదశి కృష్ణ పక్షంలో వస్తుంది. ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఈ ప్రత్యేక రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి నాడు నిష్టగా ఉపవాసాన్ని పాటిస్తే, విష్ణుమూర్తి ఖచ్చితంగా తన ఆశీస్సులను కురిపిస్తాడని నమ్ముతారు.

2026 ఫిబ్రవరిలో వచ్చే ఏకాదశులు
2026 ఫిబ్రవరిలో వచ్చే ఏకాదశులు

ఫిబ్రవరిలోని ఏకాదశులు

విజయ ఏకాదశి

ఈ నెలలో వచ్చే ఏకాదశికి చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో రెండు ముఖ్యమైన ఏకాదశులు రానున్నాయి. మొదటిది విజయ ఏకాదశి, రెండవది అమలకి ఏకాదశి. ఈ ఏకాదశులు హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విజయ ఏకాదశి పేరులో ఉన్నట్లుగా, విజయం సాధించడానికి అవకాశం ఇస్తుంది.

ఈ రోజున మనం నిష్టగా, మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి, విష్ణువుని ఆరాధిస్తే, ప్రతి ప్రతికూల విషయాన్ని జయించడం ద్వారా మనం సులభంగా ముందుకు సగచ్చు. అదే సమయంలో, అనేక రకాల అడ్డంకులు కూడా జీవితం నుండి తొలగిపోతాయి. పంచాంగం ప్రకారం, విజయ ఏకాదశి ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు రాబోతోంది.

విజయ ఏకాదశి 2026 శుభ సమయం: ఉదయం 6.26 నుండి 9.15 గంటల వరకు. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించాలి. భక్తితో విష్ణువుని ఆ రోజు ఆరాధిస్తే ఆనందంగా ఉండచ్చు, విజయాలు కలుగుతాయి.

అమలకి ఏకాదశి

ఫిబ్రవరి నెలలో కృష్ణ పక్షంలో ఈ అమలకి ఏకాదశి వస్తుంది. దీనిని ఉసిరి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ప్రత్యేక రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే చాలా ప్రయోజనాలు లభిస్తాయని కూడా నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండటం ద్వారా, ఇంట్లో ఆనందం ఉంటుంది. ప్రజలందరి ఆరోగ్యం బాగుంటుంది. అమలకి ఏకాదశి ఫిబ్రవరి 26న వచ్చింది.

అమలకి ఏకాదశి 2026 శుభ సమయం: ఆరాధనకు శుభ సమయం ఉదయం 6:15 నుండి 9:09 వరకు. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం ఉపవాసం విరమించాలి.

ఈ రెండు ఏకాదశులు వేళ ఏం చెయ్యాలి?

  • ఉదయాన్నే స్నానం చేయాలి. వీలైతే ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేయాలి.
  • విష్ణువు చిత్రం లేదా విగ్రహం ముందు పసుపు పువ్వులను సమర్పించండి.
  • ఈ రోజున, తులసిని విష్ణుమూర్తికి సమర్పించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
  • తులసి మొక్కలో లక్ష్మీమాత నివసిస్తుంది. ఈ కారణంగానే ఇది విష్ణుమూర్తికి కూడా ప్రియమైనది.
  • విజయ ఏకాదశి రోజున, మీరు పూజ గది దగ్గర ఒక కుండ నీటిని ఉంచాలి. అమలకి ఏకాదశి రోజున ఉసిరి మొక్కను పూజించడం మర్చిపోవద్దు. ఏకాదశి విచ్ఛిన్నం తర్వాత దానధర్మాలు చేయడం మంచిగా భావిస్తారు.
  • పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More