ఈరోజు జయ ఏకాదశి.. ఈ విశేషమైన రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోండి!

ప్రతి ఏకాదశికీ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. 

Published on: Jan 29, 2026, 08:01:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏకాదశి తిధికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే మోక్షం లభిస్తుందని, ఆనందంగా ఉండవచ్చని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏకాదశికీ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో.

ఈరోజు జయ ఏకాదశి.. ఈ విశేషమైన రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోండి (pinterest)
ఈరోజు జయ ఏకాదశి.. ఈ విశేషమైన రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో తెలుసుకోండి (pinterest)

ఇక మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఏకాదశి ఉపవాసం

ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటే జనన, మరణ చక్రం నుంచి విముక్తిని పొందవచ్చని నమ్ముతారు. మరణం తర్వాత జీవితం ఉండదని విశ్వసిస్తారు. అందుకే చాలా మంది ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తూ ఉపవాసం ఉంటారు.

జయ ఏకాదశి నాడు ఈ తప్పులు చేయకండి

జయ ఏకాదశి నాడు అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. జయ ఏకాదశి నాడు ఈ తప్పు చేయడం వలన విష్ణువుకి కోపం వస్తుందని నమ్మకం. అలాగే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లి, మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు. అలా చేస్తే సమస్యలు వస్తాయి, పేదరికం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తులసి విష్ణువుకు ఎంతో ఇష్టం. తులసిని ఆయనకు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి.

ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి ఆకులను కోయడం, తులసికి నీరు పోయడం వంటివి చేయకూడదు. తులసి విష్ణువు కోసం ఏకాదశి నాడు నీరు లేకుండా ఉపవాసం ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

అలాగే పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకోవడం, అవమానించడం, బాధ పెట్టడం వంటివి చేయకూడదు. ఎవరిపైనా దుర్భాషలాడడం కూడా మంచిది కాదు.

జయ ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే మంచి జరుగుతుంది

“ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని నిత్యం పఠిస్తే మంచి జరుగుతుంది.

అలాగే సామర్థ్యాన్ని బట్టి పండ్లు, పాలు తీసుకోవచ్చు.

తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఉపవాసాన్ని ప్రారంభించాలి.

నిర్జల ఉపవాసాన్ని చాలామంది పాటిస్తారు. అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. అలా చేయలేని వారు పండ్లు, పాలు తీసుకుని ఉపవాసం చేయవచ్చు.

జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన శ్రేయస్సు కలుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, సమస్యలు తొలగిపోతాయి, ఆనందంగా ఉండవచ్చు.

జయ ఏకాదశి నాడు వ్రతం చేయడం వలన పాపాలు తొలగిపోతాయి. అకాలమరణ భయం కూడా తొలగిపోతుంది. చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

జయ ఏకాదశి నాడు తులసి కోట దగ్గర దీపం పెడితే ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More