ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాము. శివుడికి, పార్వతీదేవికి శివరాత్రి అంకితం చేయబడింది. ఆ రోజు వారిద్దరూ ఒకటయ్యారని చెబుతారు. మహాశివరాత్రి (Maha shivaratri 2026) నాడు శివుడు, పార్వతి ఒకటైన సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం, కొన్ని పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటాము. పైగా శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఆ రోజు సమర్పిస్తాము.
మహాశివరాత్రి 2026 తేదీ, సమయం:

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, 2026న వచ్చింది. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడటం విశేషం. శివరాత్రి నాడు శివ, పార్వతులను ఆరాధించడం వలన అదృష్టం కలగడంతో పాటు సంతోషం, వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే జీవితంలో పురోగతిని చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే కూడా శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది.
మహాశివరాత్రి 2026 నాడు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి:
శివరాత్రి నాడు శివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులను సమర్పించండి. దీంతో వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు.శివరాత్రి నాడు శివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి పూలను సమర్పించి, అరగంట పాటు ఆలయంలో కూర్చుని “శ్రీ శివాయ నమస్తుభ్యం” అనే మంత్రాన్ని జపించండి.
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే, శివుడు ముందు ఉమ్మెత్త పువ్వును పెట్టి, ఆ పువ్వును తీసుకుని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. దీంతో శివుని అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. ఈ పరిహారాన్ని ఉదయం పాటించండి.
మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం:
సర్వార్థ సిద్ధి యోగం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు
నిషిత కాలం: రాత్రి 11:52 నుంచి 12:42 వరకు
మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగం 12 గంటలకు పైగా ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడుని ఆరాధించడం మంచిది. అలాగే శివునికి అభిషేకం కూడా చేయవచ్చు.
{{/usCountry}}మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగం 12 గంటలకు పైగా ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివుడుని ఆరాధించడం మంచిది. అలాగే శివునికి అభిషేకం కూడా చేయవచ్చు.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.