మార్చి 26 వరకు మాలవ్య రాజయోగం.. ఈ శక్తివంతమైన రాజయోగంతో నాలుగు రాశుల వారికి ఆకస్మిక లాభాలు!

మాలవ్య రాజయోగం మార్చి 26 వరకు ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనదని చెప్పొచ్చు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విలాసాలు అందుతాయి. కెరియర్, వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. శుక్రుడు మీనరాశిలో శనితో సంయోగం చెందడంతో ఈ రాజయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. 

Published on: Mar 06, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంతోషం, డబ్బు, విలాసాలు మొదలైన వాటికీ కారకుడు. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. దీనితో మాలవ్య రాజయోగం కూడా ఏర్పడింది. మార్చి 2న ఏర్పడిన ఈ మాలవ్య రాజయోగం మార్చి 26 వరకు ఉంటుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైనదని చెప్పొచ్చు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విలాసాలు అందుతాయి.

మార్చి 26 వరకు మాలవ్య రాజయోగం (pinterest)
మార్చి 26 వరకు మాలవ్య రాజయోగం (pinterest)

కెరియర్, వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. శుక్రుడు మీనరాశిలో శనితో సంయోగం చెందడంతో ఈ రాజయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి హఠాత్తుగా ఊహించని లాభాలు.. అనేక విధాలుగా మార్పులు కలుగుతాయి

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. మీనరాశిలో శుక్రుడు ఉండడంతో ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్తి కాని పనులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఈ సమయంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మాలవ్య రాజయోగంతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ఆనందం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ, రొమాన్స్ ఎక్కువ అవుతాయి. ఆదాయం పెరగడానికి అనేక అవకాశాలు మీ వద్దకు వస్తాయి.

4.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ గ్రహాల సంయోగంతో ఏర్పడిన మాలవ్య రాజయోగం బాగా కలిసి వస్తుంది. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా ఇది శుభప్రదమైన సమయం. మొత్తం మీద మాలవ్య రాజయోగం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More