March Horoscope: మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం!

మార్చి ప్రారంభంలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురువు మిధున రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి అడుగుపెడతారు. అలాగే కుజుడు ఉదయిస్తాడు. ఇలా గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారికి మాత్రమే మార్చి నెల బాగా కలిసి రాబోతోంది. 

Published on: Feb 25, 2026, 16:30:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. 2026 ప్రారంభం అయ్యి ఇప్పటికే రెండు నెలలు పూర్తికాబోతున్నాయి. మార్చి నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. మార్చి నెలలో హోలీతో పాటు కొన్ని పర్వదినాలు ఉన్నాయి. అయితే మార్చి నెలలో కొన్ని రాశుల వారికి మాత్రం బాగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు.

March Horoscope: మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం! (pinterest)
March Horoscope: మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం! (pinterest)

మార్చి నెలలో గ్రహాల సంచారంలో మార్పు

మార్చి ప్రారంభంలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురువు మిధున రాశిలో నేరుగా సంచారం చేస్తాడు. బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి అడుగుపెడతారు. అలాగే కుజుడు ఉదయిస్తాడు. ఇలా గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారికి మాత్రమే మార్చి నెల బాగా కలిసి రాబోతోంది.

దీనితో కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగం కూడా లభించవచ్చు. మరి ఏ రాశి వారికి మార్చి నెల బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? తెలుసుకుందాం.

మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం.. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. పెళ్లికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కూడా ఇదే శుభ సమయం. ఆర్థికపరంగా అనేక లాభాలు ఉంటాయి. పని ప్రదేశంలో మంచి పురోగతిని చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభసమయం. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది.

2.తులా రాశి

తులా రాశి వారికి మార్చి నెల బాగుంటుంది. మార్చి నెలలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఇది శుభ సమయం. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. మీ పని ప్రదేశంలో ఆఫీసర్లు మీ పనిని చూసి మెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఈ సమయంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

3.మీన రాశి

మీన రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ రావచ్చు. వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి వంటి వాటిని కూడా ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విజయాలను అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More