March Horoscope: మార్చి నెలలో మూడు గ్రహాల సంచారంలో మార్పు.. 5 రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బు, సంతోషం డబుల్!

మార్చి మూడున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ ముందు రోజు, అనగా మార్చి 2న శుక్రవారం, సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26న శుక్రుడు మీనరాశి నుంచి మేష రాశికి వస్తాడు. ఇలా మూడు సార్లు గ్రహాల సంచారంలో మార్పు రావడంతో ఐదు రాశుల వారి అదృష్టం పెరగబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. 

Published on: Feb 24, 2026, 16:30:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెలా కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడం చూస్తూ ఉంటాం. ఈ గ్రహాల సంచారంలో మార్పు వస్తే మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అప్పుడే 2026లో ఫిబ్రవరి నెల కూడా పూర్తి కాబోతోంది. త్వరలోనే మార్చి నెలలోకి ప్రవేశించబోతున్నాము.

March Horoscope: మార్చి నెలలో మూడు గ్రహాల సంచారంలో మార్పు.. 5 రాశులకు గోల్డెన్ డేస్ (pinterest)
March Horoscope: మార్చి నెలలో మూడు గ్రహాల సంచారంలో మార్పు.. 5 రాశులకు గోల్డెన్ డేస్ (pinterest)

మార్చి నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రహాల సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తున్నాయి. మరి ఆ గ్రహాలు ఏవి? ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి ప్రయోజనాలు మార్చి నెలలో పొందబోతున్నారు? తెలుసుకుందాం.

మార్చి నెలలో మూడు గ్రహాల సంచారంలో మార్పు

మార్చి నెలలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు రెండు సార్లు సంచారంలో మార్పు చేస్తాడు. మార్చి మూడున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ ముందు రోజు, అనగా మార్చి 2న శుక్రవారం, సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 26న శుక్రుడు మీనరాశి నుంచి మేష రాశికి వస్తాడు. ఇలా మూడు సార్లు గ్రహాల సంచారంలో మార్పు రావడంతో ఐదు రాశుల వారి అదృష్టం పెరగబోతోంది.

మార్చి నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం, అనేక విధాలుగా లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి మార్చి నెల బాగా కలిసి రాబోతోంది. గత రెండు నెలల కంటే ఈ నెల మీకు బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను సమయానికి పూర్తిచేస్తారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.

2.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. వృషభ రాశి వారు ఆనందంగా ఉంటారు. మార్చి నెల బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ పొందవచ్చు. మీ బాస్‌ను ఇంప్రెస్ చేస్తారు. శుభవార్తలను వింటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. పాత గొడవలన్నీ తొలగిపోతాయి.

3.తులా రాశి

తులా రాశి వారికి మార్చి నెల బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను కూడా అందుకుంటారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి.

4.సింహ రాశి

సింహ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో బాగా లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలను వింటారు. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

5.మీన రాశి

మీన రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో మీన రాశి వారు ఆనందంగా ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆనందం రెట్టింపు అవుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More