Powerful Gajakesari Yogam: చంద్ర, గురువుల కలయికతో గజకేసరి రాజయోగం.. 4 రాశులకు డబ్బు, అందమైన ప్రేమ జీవితం, అదృష్టం!
గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మేల్కొనబోతోంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత మొదలైన వాటికి కారకుడు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మేల్కొనబోతోంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు.

ఫిబ్రవరి 26న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో గురువుతో సంయోగం చెందుతాడు. ఇప్పటికే గురువు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
చంద్ర, గురువుల కలయికతో గజకేసరి రాజయోగం. ఈ శక్తివంతమైన యోగంతో ఈ రాశుల వారికి కాసుల వర్షం
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సంయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు వస్తాయి. ఆర్థిక లాభాలను పొందుతారు. అదృష్టం పెరుగుతుంది. మీరు ఇష్టపడే వ్యక్తి మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఇలా అనేక లాభాలను ఈ సమయంలో చూస్తారు.
2.మిధున రాశి
మిధున రాశి వారికి ఇది శుభ సమయం. గజకేసరి రాజయోగంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. పని ప్రదేశంలో అభివృద్ధిని చూస్తారు. సానుకూల ఆలోచనలతో సక్సెస్‌ను అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
3.కన్య రాశి
కన్య రాశి వారికి గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పెద్ద డీల్స్‌ను పొందుతారు. మొత్తం మీద ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆనందంగా ఉంటారు.
4.తులా రాశి
తులా రాశి వారికి గజకేసరి రాజయోగంతో బాగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ముఖ్యమైన ఈవెంట్లలో భాగమవుతారు. మొత్తం మీద గజకేసరి రాజయోగంతో ఈ రాశి వారు కూడా భారీగా లాభాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


