మహాలక్ష్మీ రాజయోగం: చంద్ర, కుజుల కలయికతో ఈ మూడు రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు!
వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుని సంచార మార్పు కూడా చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరి 16న చూసినట్లయితే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఇప్పటికే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది మహాలక్ష్మీ రాజయోగాన్ని సృష్టిస్తుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతూ ఉంటాయి. దాంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి గ్రహం కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుని సంచార మార్పు కూడా చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరి 16న చూసినట్లయితే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజుడు ఇప్పటికే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది మహాలక్ష్మీ రాజయోగాన్ని సృష్టిస్తుంది. మరో 10 రోజుల్లో మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది.
చంద్ర, కుజుల కలయికతో మహాలక్ష్మీ రాజయోగం
చంద్రుడు మనసు, ఆలోచన విధానం మొదలైన వాటికి కారకుడు. జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నట్లయితే మానసికంగా స్థిరంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆనందం కూడా ఉంటుంది. అదే చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆందోళన, మనసుకు మతిమరుపు మొదలైన వాటితో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కుజుడు ధైర్యం, పరాక్రమం వంటి వాటికి కారకుడు. కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటారు. స్థిరాస్తులు, ఇల్లు, నిర్మాణాలు, భూమి వంటి రంగాలకు కుజుడు బాధ్యుడు.
మకర రాశిలో మహాలక్ష్మీ రాజయోగం
మకర రాశిలో ఈ రెండు గ్రహాల కలయికతో ఫిబ్రవరి 16న మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారు కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వస్తాయి. ఇలా అనేక లాభాలు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? మీరు కూడా ఈ అదృష్ట రాశుల్లో ఉన్నారేమో చూసుకోండి.
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. జీవితం సానుకూలంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పని, వ్యాపారంలో పురోగతిని చూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. భవిష్యత్తులో ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. పూర్వీకుల ఆస్తి లాభం కూడా ఉంటుంది.
2.మకర రాశి
మకర రాశి వారికి రెండు గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. దీంతో ఒక్కసారిగా ఈ రాశి వారి జీవితం మారిపోతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుంచి భారీక లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది శుభసమయమే.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి జీవితం ఒక్కసారిగా మహాలక్ష్మీ రాజయోగంతో మారుతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఆనందం ఎక్కువవుతుంది. గత పెట్టుబడుల నుంచి ఎక్కువగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఇది అద్భుతమైన సమయం. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. ఆఫీస్‌లో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతోంది. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


