కుజుడి స్థానం బలహీనంగా ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, కెరీర్‌లో సమస్యలు వంటివి రావచ్చు.. సంకేతాలు, పరిహారాలు తెలుసుకోండి!

జాతకంలో కుజ స్థానం సరిగా లేకపోతే పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తప్పక ఎదురవుతాయి. పని ప్రదేశంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి సమయంలో కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. అలాగే కుజ స్థానం బలహీనంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం.

Published on: Jan 26, 2026, 15:00:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నట్లయితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో కుజ స్థానం సరిగా లేకపోతే పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. జీవితంలో ఎదగాలని ప్రయత్నించినా ఆటంకాలు ఎదురవుతాయి. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఏమవుతుంది?

కుజుడి స్థానం బలహీనంగా ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, కెరీర్‌లో సమస్యలు వంటివి రావచ్చు
కుజుడి స్థానం బలహీనంగా ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, కెరీర్‌లో సమస్యలు వంటివి రావచ్చు

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తప్పక ఎదురవుతాయి. పని ప్రదేశంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి సమయంలో కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. అలాగే కుజ స్థానం బలహీనంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం.

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు

తరచూ గొడవలు రావడం:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన తగాదాలు కూడా ఎదురవుతాయి.

ఎక్కువ కోపం:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్న వారికి కోపం త్వరగా వస్తుంది. చిన్న విషయానికే సులువుగా కోపపడతారు.

అనారోగ్య సమస్యలు:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు బీపీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలాగే బలహీనత, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

కెరీర్‌లో ఇబ్బందులు:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నట్లయితే కెరీర్‌లో సమస్యలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా కూడా సక్సెస్ త్వరగా రాదు.

సహనం ఉండదు:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉన్నట్లయితే సహనాన్ని కోల్పోతారు. ఎప్పుడూ మనసు అస్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కాన్ఫిడెన్స్ తగ్గుతుంది:

జాతకంలో కుజ స్థానం బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. భయం వెంటాడుతుంది.

జాతకంలో కుజ స్థానం బలపడాలంటే ఏం చేయాలి?

  1. ఒకవేళ జాతకంలో కుజ స్థానాన్ని బలపరచాలంటే రోజూ హనుమాన్ చాలీసాను పఠించండి లేదా కనీసం మంగళవారం నాడు అయినా హనుమాన్ చాలీసాను చదవండి. హనుమంతుడికి శనగలను నైవేద్యంగా పెడితే కుజ దోషాలు తగ్గుతాయి, సమస్యలు తీరుతాయి.
  2. అలాగే పగడాన్నిధరిస్తే కూడా కుజ దోషం నుంచి బయటపడవచ్చు.
  3. మంగళవారం నాడు 108 సార్లు “ఓం క్రం క్రీం క్రోం సహ భౌమాయ నమః” అనే మంత్రాన్ని పఠించండి.
  4. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
  5. మంగళవారం నాడు ఉపవాసం ఉండడం వల్ల కూడా జాతకంలో కుజ స్థానాన్ని బలపరచవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More