Margasira Masam: ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు.. ఈ పనులు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, బాధలన్నీ తీరిపోతాయి!

తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. మార్గశిర మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపలు తొలగిపోతాయి.

Published on: Nov 21, 2025, 09:00:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు మాసాల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. “మాసానాం మార్గశీర్షోహమ్” అని అంటారు. మార్గశిర మాసం లక్ష్మీనారాయణుడికి చాలా ఇష్టం. ఈ నెలలో చేయాల్సిన పూజలు, పుణ్య కార్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు (pinterest)
ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు (pinterest)

ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు

ఈ రోజున పోలి పాడ్యమి నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. పోలి పాడ్యమి కథను చదువుకుంటారు.

తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.

మార్గశిర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?

నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 20 వరకు ఉంటుంది. ఈ నెల రోజులు దీపారాధన చేసి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. మరి, ఇక ఈ మాసంలో ఏ పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం.

మార్గశిర మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపలు తొలగిపోతాయి

  1. మార్గశిర మాసంలో శంఖాన్ని పూజించాలి. శంఖంలో గంగాజలం పోసి ఇంటి నలుమూలలా చల్లాలి. ఇలా చేయడం వలన మనస్పర్థలు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది, కుటుంబం అంతా ఆనందంగా గడపొచ్చు.
  2. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను మార్గశిర మాసంలో పఠిస్తే ఎంతో మంచిది జరుగుతుంది. గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయి.
  3. మార్గశిర మాసంలో “ఓం కృష్ణాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వలన మీ కోరికలన్నీ తీరుతాయి.
  4. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మార్గశిర మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది. ఇది చాలా విశిష్టమైనది.
  5. ధనుర్మాసంలో ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించాలి.
  6. ధనుర్మాసం మొదలైన తర్వాత వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పేరిట విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషమైనది.
  7. శీతాకాలంలో మార్గశిర మాసం వస్తుంది కనుక దుప్పట్లు వంటివి దానం చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని చూస్తారు. పుణ్యం కూడా వస్తుంది.
  8. మార్గశిర మాసంలో తగాదాలకు దూరంగా ఉండాలి.
  9. ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది; ధనవంతులు అవుతారు. విష్ణువుని క్రమం తప్పకుండా ఈ నెలలో ఆరాధించి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తే కూడా మంచిది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More