Poli Padyami: ఈరోజే పోలి పాడ్యమి.. దీపాలను వెలిగించి ఇలా చేయండి.. సమస్యలన్నీ తొలగిపోతాయి!

కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. ఈ ఏడాది పోలి నవంబర్ 21, అంటే ఈరోజు వచ్చింది. పోలి పాడ్యమి నాడు దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శివ-కేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు. 

Published on: Nov 21, 2025, 05:00:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటాము. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. ఈ ఏడాది పోలి నవంబర్ 21, అంటే ఈరోజు వచ్చింది. పోలి పాడ్యమి నాడు దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శివ-కేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పోలి పాడ్యమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

Poli Padyami: ఈరోజే పోలి పాడ్యమి.. దీపాలను వెలిగించి ఇలా చేయండి (pinterest)
Poli Padyami: ఈరోజే పోలి పాడ్యమి.. దీపాలను వెలిగించి ఇలా చేయండి (pinterest)

దీపారాధన

పోలి పాడ్యమి చాలా విశేషమైనది. కార్తీక మాసం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పోలి పాడ్యమి నాడు దీపాలను వెలిగించి ప్రవహించే నదుల్లో వదలాలి. కుదిరితే 31 దీపాలు లేదా ఒత్తులను వెలిగించి వదలడం మంచిది.

పితృదేవతల అనుగ్రహం

ఈ ముఖ్యమైన రోజున ఏమాత్రం వదులుకోవద్దు. పోలి పాడ్యమిని “పోలి స్వర్గం” అని కూడా అంటారు. ఈరోజు పూజలు, హోమాలు, దానాలు, తర్పణాలు వదలడం వంటివి చేయడం వలన మంచి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. పితృదేవతలు సంతోషపడతారు, వారి ఆశీస్సులు పొందవచ్చు. పితృదోషాలు, కుజ దోషాలు వంటివి తొలగించుకోవడానికి ఈరోజు చాలా అద్భుతమైన రోజు.

ఆర్థికపరంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురుకాకుండా ఈరోజు 31 దీపాలను పారే నదిలో వదిలిపెట్టండి. ప్రతికూల శక్తి నుంచి బయటపడడానికి పోలి పాడ్యమి నాడు దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే మంచిది. పోలి పాడ్యమి నాడు దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. పేదలకు, కుక్కలకు, కాకులకు ఆహారం పెట్టడం వంటివి చేయొచ్చు.

బొందితో స్వర్గం

పోలి పాడ్యమి నాడు దీప దానం చేయడం.. నదులు, చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేయడం వలన చక్కటి ఫలితాన్ని చూడచ్చు. పోలి పాడ్యమిని పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని అంటారు. 30 వత్తులతో కూడిన దీపాలను వెలిగిస్తే చాలా మంచిదట. సమీపంలో నదులు, చెరువులు లెక్కడపోతే ఇత్తడి పళ్లెలో నీళ్లు పోసి, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి దీపాలను వదులుకోవడం మంచిది. అలాగే పోలి పాడ్యమి నాడు “పోలి స్వర్గం” కథ కూడా చదువుకోవాలి.

పోలి పాడ్యమి నాడు దీపాలు పెట్టిన తర్వాత ఇలా చేయండి:

పోలి పాడ్యమి నాడు తెల్లవారుజామున నక్షత్రం ఉండగానే నీటిలో దీపాలను విడిచిపెట్టిన తర్వాత “కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తిక మహాలక్ష్మి, పోలేరమ్మను ఎలా అయితే స్వర్గానికి పంపించావో, అలాగే నన్ను కూడా తీసుకెళ్ళు. గోరంత పసుపు, కుంకుమ నీవు తీసుకుని, కొండంత పసుపు కుంకుమ మాకు ఇవ్వు.” అని చెప్పి నమస్కరించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More