ఈరోజే కార్తీక అమావాస్య.. అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఎలా కలుగుతుందో తెలుసుకోవడంతో పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి!

ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. కార్తీక అమావాస్య నాడు చంద్రుడిని పూజించడం, ఉపవాసం ఉండడం వలన కోరికలు తీరుతాయి. కార్తీక అమావాస్య రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.

Published on: Nov 20, 2025, 08:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా విశేషమైనది. కార్తీక అమావాస్య నవంబర్ 20 అంటే ఈరోజు వచ్చింది. ఈరోజు పవిత్ర స్నానాలు చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి.

కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే మంచిది? (pinterest)
కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే మంచిది? (pinterest)

శ్రార్ధ కర్మ, పితృతర్పణం, నిరుపేదలకు సహాయం చేయడం వంటివి చాలా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. పితృదోష నివారణ కోసం చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు, దానాలు చేస్తూ ఉంటారు. కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలను తెలుసుకుందాం.

చంద్రుని పూజ చేయండి

కార్తీక అమావాస్య నాడు చంద్రుడిని పూజించడం, ఉపవాసం ఉండడం వలన కోరికలు తీరుతాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. కార్తీక అమావాస్య రోజు కొన్ని పనులు మాత్రం పొరపాటున కూడా చేయకూడదు.

కార్తీక అమావాస్య నాడు ఏం చేస్తే మంచిది?

  1. కార్తీక అమావాస్య నాడు నది స్నానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. అలా కుదరకపోతే చెరువు లేదా కొలనులో చేయొచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం ఉంటే కూడా సకల బాధలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.
  2. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ అమావాస్యనాడు శ్రద్ధకర్మ, తర్పణాలు, పిండదానం వంటివి చేస్తే మంచిది.
  3. సత్యనారాయణ కథ వింటే కూడా ఈరోజు ఎంతో పుణ్యం వస్తుంది.
  4. పేదవారికి దుప్పట్లు, బూట్లు, చెప్పులు, బెల్లం, నువ్వులు, ఉసిరి, పంచదార వంటి దానాలు చేస్తే కూడా చాలా మంచిది.

కార్తీక అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

  1. కార్తీక అమావాస్య నాడు పెద్దలను కించపరచడం, అగౌరవపరచడం వంటివి చేయకూడదు.
  2. మద్యం, మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
  3. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త కారు కొనడం వంటివి మంచిది కాదు.
  4. కార్తీక అమావాస్య నాడు నల్లని దుస్తులు ధరించడం మంచిది కాదు.

దోషాలు తొలగి పోవాలంటే ఈ రోజు ఇలా చేయండి

  • కార్తీక అమావాస్య నాడు వెండి దీపంలో బంగారు వత్తి వేసి దానం చేస్తే అఖండ సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. లేదంటే దీపదానం చేస్తే కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు.
  • కార్తీకమాసం స్వయంపాకం ఇస్తే కూడా మంచి జరుగుతుంది.
  • కార్తీక అమావాస్య నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. జలాభిషేకం చేస్తే అపవృత్తి దోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.
  • ఈరోజు దానం, జపం, స్నానం, తపస్సు చేస్తే ఎంతో మంచి ఫలితాలని పొందవచ్చు. 30 రోజులు ఏ పూజ చేయని వారు, దీపారాధన చేయని వారు ఈ ఒక్క రోజుని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపారాధన చేసి జపం చేసి ఉపవాసం ఉంటే సరిపోతుంది. అలాగే సాయంత్రం దేవతార్చన చేసుకోవాలి. అన్నదానం చేస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More