Poli Swargam katha: ఈ నెల 21న పోలి పాడ్యమి.. విశిష్టతతో పాటు ఆ రోజు చదువుకోవాల్సిన కథ తెలుసుకోండి!
కార్తీకమాసంలో శివ–కేశవలను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈసారి పోలి పాడ్యమి నవంబర్ 21న వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు.
కార్తీకమాసంలో శివ–కేశవలను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు, అంటే పాడ్యమినాడు, పోలి పాడ్యమిని జరుపుతారు. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలి పాడ్యమి నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు, నదుల్లో దీపాలను వదులుతారు. ఆ రోజున ముఖ్యంగా పోలి కథను చదువుకోవాలి.

ఈసారి పోలి పాడ్యమి నవంబర్ 21, శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమిని చేస్తారు.
పోలి పాడ్యమి విశిష్టత
పోలి పాడ్యమి నాడు దీప దానం చేయడం, నదులు, చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు. పోలి పాడ్యమి నాడు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు అని పురాణంలో ఉంది. ఆ రోజున 30 వత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. అరటి దొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నది జలాల్లో వదిలిపెట్టాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు, సమీపంలో నదులు–చెరువులు లేనివారు ఇత్తడి పళ్లెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు.
పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం కథ
ఒక చాకలి స్త్రీకి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్లు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడళ్లు తోడుగా నది స్నానానికి వెళ్లి దీపం పెట్టి వస్తూ ఉండేది. చిన్న కోడలే ఇంటి చాకిరీ అంతా చేస్తూ ఉండేది. ఆమెకు పనులను అప్పగించి ముగ్గురు కోడళ్లతో ఆలయానికి వెళ్లి పూజలు చేసుకు వచ్చేది. చిన్న కోడలి పోలికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చేయాలని, దీపారాధన చేయాలని కోరిక ఉండేది.
ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది
కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతో నది స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది. చిన్న కోడలను పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు. కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడళ్లతో పాటు నది స్నానానికి వెళ్లింది. చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి, పెరట్లో ఉన్న పత్తిచెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకుని వత్తిగా చేసింది. బావి దగ్గర స్నానం చేసి, తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది.
విమానాన్ని తీసుకొచ్చారు
దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బానను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్లింది. ఆ విధంగా వెళ్లడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు. అత్తగారు, ముగ్గురు కోడల్లి పోలి స్వర్గానికి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు.
వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాళ్లు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, చిన్న కోడలిని వదిలిపెట్టమని, మిగిలిన ముగ్గురు కోడళ్లను మాత్రమే తీసుకుని పూజలు చేసావని అన్నారు. “మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు. కానీ ఈమె ఒక్క రోజు ఇంట్లో దీపం పెట్టుకున్నా, భక్తిశ్రద్ధలతో పెట్టింది.
పురాణ పఠనం, శ్రవణం చేసినంత ఫలితం
అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను” అని చెప్పారు. మిగిలిన వారిని “మీరు అడవుల్లో పాలైపోవు” అని శపించారు. ఈ కథను విని, అక్షింతలు వేసుకున్నట్లయితే, కార్తీకమాసం అంతా పురాణ పఠనం, శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


