అధికమాసంలో శుభకార్యాలకు బ్రేక్ పడింది. అధిక జ్యేష్ఠ మాసం కొన్ని రోజులతో పూర్తి కాబోతోంది. ఈ అధికమాసం ముగింపుకు రావడంతో వివాహం చేసుకోవాలనుకునే వారికి, వారి తల్లిదండ్రులకు కాస్త ఊరట లభించబోతోంది.

పంచాంగం ప్రకారం, అధికమాసం పూర్తి అయ్యాక జూన్ 19 నుంచి పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం అధికమాసంలో పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు జరపరు. ఒక నెల పాటు వీటన్నిటికీ బ్రేక్ పడింది. మళ్లీ జూన్ చివరి వారం నుంచి అద్భుత యోగాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
జూన్ చివరి వారంలో అద్భుత యోగాలు
అధిక మాసం పూర్తయిన తర్వాత గ్రహాలు, నక్షత్రాల స్థితి అనుకూలంగా మారనుంది. జూన్ చివరి రోజుల్లో చూసినట్లయితే వివాహాలకు అనుకూలమైన శుభ నక్షత్రాలు కలిసి వస్తున్నాయి. ఉత్తర ఫల్గుణి, హస్త, స్వాతి, అనూరాధ, మూల నక్షత్రాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ నక్షత్రాల కాలంలో జరిగే పెళ్లిళ్లు వివాహ బంధంలో సామరస్యాన్ని పెంచుతాయి. దంపతుల మధ్య ప్రేమ కూడా విపరీతంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది.
జూన్ - జూలై 2026 నెలలో వివాహ ముహూర్తాలు
జూన్, జూలై నెలల్లో వివాహాలకు కొన్ని పరిమిత శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఆ తేదీల గురించి ఇప్పుడు చూద్దాం.
జూన్ 2026 ముహూర్తాలు
జూన్ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
జూలై 2026 ముహూర్తాలు
జూలై 1, 2, 6, 7, 8, 11 తేదీల్లో పెళ్లిళ్లకు అనుకూలంగా ఉంది. మళ్లీ జూలై నెలలో ఆషాఢమాసం కూడా మొదలవుతుంది. కనుక ముహుర్తాలు పరిమితంగా వున్నాయి. ఆషాడ మాసంలో పెళ్లిళ్లు జరపరు.
జాతక పొంతన చూసుకోవాలి
పంచాంగంలో వచ్చే శుభముహూర్తాలు సాధారణంగా గణనల ఆధారంగా ఉంటాయి. అయితే పెళ్లిళ్లు వంటి పెద్ద కార్యాలు నిశ్చయించేటప్పుడు ఖచ్చితంగా వధూవరుల జాతకాలను సరిచూసుకోవడం అవసరం. లగ్న శుద్ధి, చంద్ర శుద్ధి, తారాబలం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. అందుకే పెళ్లిళ్లకు ముహూర్తాలను పెట్టుకునేటప్పుడు అర్హులైన జ్యోతిష్యులను లేదా పురోహితులను సంప్రదించాలి.
సోమవతి అమావాస్య నాడు ప్రత్యేక యోగం
{{/usCountry}}పంచాంగంలో వచ్చే శుభముహూర్తాలు సాధారణంగా గణనల ఆధారంగా ఉంటాయి. అయితే పెళ్లిళ్లు వంటి పెద్ద కార్యాలు నిశ్చయించేటప్పుడు ఖచ్చితంగా వధూవరుల జాతకాలను సరిచూసుకోవడం అవసరం. లగ్న శుద్ధి, చంద్ర శుద్ధి, తారాబలం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. అందుకే పెళ్లిళ్లకు ముహూర్తాలను పెట్టుకునేటప్పుడు అర్హులైన జ్యోతిష్యులను లేదా పురోహితులను సంప్రదించాలి.
సోమవతి అమావాస్య నాడు ప్రత్యేక యోగం
{{/usCountry}}అధికమాసం అమావాస్య జూన్ 15న రాబోతోంది. ఈ అమావాస్య రోహిణి ధృతి యోగం, మృగశిర నక్షత్రం, సర్వార్థ అమృత సిద్ధి యోగం వంటి శుభసంయోగాలతో ఏర్పడడం విశేషం.