కుజ, కేతువుల ప్రమాదకరమైన కలయిక, 5 రాశుల వారికి 51 రోజులు కష్టాలు.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది!

సింహ రాశిలోకి కుజుడు సంచరించడం వలన కుజుడు-కేతువుల ప్రమాదకరమైన అశుభ సంయోగం ఏర్పడుతుంది. సూర్యుని రాశిలో ఉగ్ర గ్రహాలు అయినటువంటి కుజుడు-కేతువు కలయిక కుజ కేతు యోగంను సృష్టిస్తోంది. ఇది అశుభకరమైన యోగం. దీనితో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Published on: Jun 07, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు సింహ రాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. కుజుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి సమస్యలుఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుజ, కేతువుల ప్రమాదకరమైన కలయిక
కుజ, కేతువుల ప్రమాదకరమైన కలయిక

సింహ రాశిలో ఇప్పటికే కేతువు ఉన్నాడు. సింహ రాశిలోకి కుజుడు సంచరించడం వలన కుజుడు-కేతువుల ప్రమాదకరమైన అశుభ సంయోగం ఏర్పడుతుంది. సూర్యుని రాశిలో ఉగ్ర గ్రహాలు అయినటువంటి కుజుడు-కేతువు కలయిక కుజ కేతు యోగంను సృష్టిస్తోంది. ఇది అశుభకరమైన యోగం. దీనితో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహ రాశిలో కుజుడు

సింహ రాశిలో కుజుడు జూలై 28 వరకు ఉంటాడు. దాంతో ఈ 51 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం చెబుతోంది. ఒక్క రోజు కూడా కొన్ని రాశుల వారు సమస్యలు కలగకుండా ఉండడానికి శ్రద్ధ వహించాలి.

ఈ సంయోగం సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి:

1.మేష రాశి:

మేష రాశివారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మేష రాశి వారి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కెరియర్‌లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీరు వెనకబడిపోయినట్లు అనిపించవచ్చు. ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడొద్దు. సంబంధాల్లో అపార్థాలు పెరిగే అవకాశం ఉంది.

2.వృషభ రాశి:

వృషభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. ఆస్తులకు సంబంధించి వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరంగా మాట్లాడి తప్పు చేయకండి.

3.సింహ రాశి:

సింహరాశి వారికి ఈ సంయోగం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కోపం ఎక్కువవుతుంది. గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

4.కన్యా రాశి:

కన్యారాశి వారికి ఈ సంయోగం వలన ఇబ్బందులు రావచ్చు. కష్టపడి ఎక్కువ పని చేసినా కానీ మంచి ఫలితాలు రావని అనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు రావచ్చు. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాస్త తెలివిగా ఆలోచించండి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి.

5.మీన రాశి:

ఈ సంయోగం వలన మీనరాశి వారు కోపంగా మారే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అనవసరంగా కఠినమైన మాటలు మాట్లాడకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

News/Rasi Phalalu/కుజ, కేతువుల ప్రమాదకరమైన కలయిక, 5 రాశుల వారికి 51 రోజులు కష్టాలు.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది!
News/Rasi Phalalu/కుజ, కేతువుల ప్రమాదకరమైన కలయిక, 5 రాశుల వారికి 51 రోజులు కష్టాలు.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది!