గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు ఇబ్బందులు కలిగితే, కొన్నిసార్లు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాము. అప్పుడప్పుడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. ఏప్రిల్ 13, అనగా నిన్న ఏర్పడిన ఈ సంయోగం వారం వరకు ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తాయి.

కుజుడు ధైర్యం మొదలైన వాటికే కారకుడు. నెప్ట్యూన్ కలల గ్రహము. ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువ పడుతుంది. ఏ రాశి వారికి సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుజ, నెప్ట్యూన్ గ్రహాల సంయోగంతో ఈ రాశుల వారికి ఇబ్బందులు.. జాగ్రత్త సుమా
1.మిధున రాశి:
మిధున రాశి వారికి ఈ సమయంలో సమస్యలు వస్తాయి. కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి; లేకపోతే అపార్థాలు కలగవచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గొడవలు పెరిగే అవకాశం ఉంది. రిలేషన్‌షిప్‌లో ప్రతికూల ప్రభావాన్ని చూస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని రోజులు ఆగితే మంచిది.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయంలో సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే తోటి ఉద్యోగస్తులతో, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి ఏం చెబుతున్నారో సరిగ్గా అర్థం చేసుకోవాలి; లేకపోతే గొడవలు జరిగే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు ముగింపుకు వచ్చేయకండి; జాగ్రత్తగా వినండి, నిజం తెలుసుకోవాలి.
3.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగంతో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. కన్ఫ్యూజన్ వద్దు; సమయం తీసుకోండి, సహనంతో ఉండండి. అనవసరంగా ప్రతి దానిని తొందరగా దాటేయాలని ప్రయత్నించకండి.
4.మీన రాశి:
{{/usCountry}}ధనస్సు రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగంతో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. కన్ఫ్యూజన్ వద్దు; సమయం తీసుకోండి, సహనంతో ఉండండి. అనవసరంగా ప్రతి దానిని తొందరగా దాటేయాలని ప్రయత్నించకండి.
4.మీన రాశి:
{{/usCountry}}మీన రాశి వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఈ రెండు గ్రహాల సంయోగం వలన ఈ రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఏ విషయాన్ని రహస్యంగా దాచి పెట్టకండి; దాని వలన రిలేషన్‌షిప్‌లో గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకుండా ఆగి ఉండడం మంచిది. ఎమోషనల్‌గా కాకుండా లాజికల్‌గా ఉండడం అవసరం.