వృషభ రాశిలోకి అంగారకుడు - జూలై వరకు ఈ విషయాల్లో జాగ్రత్త పడాల్సిందే!
నవగ్రహాలలో సేనాధిపతి అయిన అంగారకుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి ఇంట్లో కుజుడి సంచారం వల్ల ప్రజల ప్రవర్తన, ప్రేమ బంధాలు, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఇక్కడ తెలుసుకోండి…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే శక్తి, పట్టుదల, పరాక్రమానికి కారకుడైన అంగారక గ్రహం (కుజుడు) వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వేద జ్యోతిష్యం ప్రకారం అంగారకుడిని తీవ్రమైన శక్తి, అభిరుచి, కోపానికి ప్రతీకగా భావిస్తారు. మరోవైపు వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, బంధాలు, లగ్జరీ జీవితానికి కారకుడు. ఈ నేపథ్యంలో అగ్ని తత్వ గ్రహమైన కుజుడు, విలాసాలకు కారకుడైన శుక్రుడి రాశిలోకి రావడం వల్ల మానవ ప్రవర్తన, సంబంధాలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.

"అంగారకుడి ఈ రాశి పరివర్తనం అంత సమతుల్యంగా ఏమీ లేదు," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషించారు. ఈ సంచార కాలంలో ప్రజల స్వభావంలో మునుపటి కంటే వేగం, తొందరపాటు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎలాంటి కారణం లేకుండానే మనస్సు నిరాశకు గురికావడం వంటి మార్పులు కనిపిస్తాయి.
ఈ గ్రహ సంచార ప్రభావం మనుషుల మాట తీరుపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆవేశంలో నోరు జారి, ఆ తర్వాత పశ్చాత్తాపపడే పరిస్థితులు వస్తాయి. అందువల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఎంతో ఓపికగా ఉండాలి. చిన్నపాటి చర్చలు కూడా పెద్ద వివాదాలుగా మారే ప్రమాదం ఉంది.
ప్రేమ, వైవాహిక బంధాలలో సవాల్…
ప్రేమ బంధాలలో ఉన్నవారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాముల మధ్య అపార్థాలు చాలా వేగంగా తలెత్తుతాయి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా, ఆవేశంతో తక్షణమే స్పందించడం (రియాక్ట్ అవ్వడం) వల్ల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో కమ్యూనికేషన్ పూర్తిగా ఆపేయడం కంటే, మనసు విప్పి బహిరంగంగా మాట్లాడుకోవడం మంచిది. ఈ ప్రభావం వైవాహిక జీవితంపై కూడా పడుతుంది. ఇంట్లో చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య వాదనలు జరగవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే దీనికి ఏకైక పరిష్కారం. కోపంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులను మరింత పెంచుతాయి.
ఆరోగ్యంపై చూపే ప్రభావం
శారీరక మార్పుల పరంగా కూడా ఈ సంచారం ప్రభావం చూపుతుంది. "ఈ కాలంలో కొంతమందికి హార్మోన్ల సమతుల్యత లోపించడం వంటి సమస్యలు రావచ్చు," అని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. దీనితో పాటు మానసిక చంచలత, చిరాకు, అనవసర ఒత్తిడి పెరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో తినే ఆహారం, నిద్రపోయే సమయాలు, దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.
దోషాల నివారణకు ఏం చేయాలి?
- ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే కోపంతో స్పందించకుండా, కాసేపు ఆగి ప్రశాంతంగా ఆలోచించాలి.
- బంధాల మధ్య అహాన్ని (ఈగో) రానివ్వకూడదు.
- ప్రేమ, వివాహ బంధాలలో నిరంతరం సత్సంబంధాలు, సంభాషణలు కొనసాగించాలి.
- సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా శారీరక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
- వివాదాలను మరింత పెద్దవి చేయకుండా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

