...
...
Next Story

మిథునంలోకి అంగారకుడు - సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం!

అంగారకుడు మిథునరాశిలోకి ప్రవేశించడంతో రాబోయే 25 రోజులు 4 రాశుల జాతకులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇందులో మేషం, సింహం, ధనుస్సు, మకర రాశులున్నాయి.

Published on: Aug 25, 2026, 08:13:18 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సేనాధిపతిగా భావించే అంగారక (అంగారకుడు/కుజ) గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కుజుడి కదలికల్లో మార్పు వచ్చినప్పుడల్లా ద్వాదశ రాశుల జీవితాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జాతకంలో అంగారక గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఉత్సాహం అపారంగా పెరుగుతాయి.

మిథునంలోకి అంగారకుడు
మిథునంలోకి అంగారకుడు

ప్రస్తుతం అంగారకుడు బుధుడికి చెందిన మిథున రాశిలో గోచరిస్తున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం…. రాబోయే 25 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 18 సాయంత్రం వరకు కుజుడు ఇదే రాశిలో కొనసాగుతాడు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిథున రాశిలో అంగారక సంచారం వల్ల రాబోయే 25 రోజులు ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలు రానున్నాయి.

మేష రాశి :

మిథున రాశిలో అంగారకుడి సంచారం మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీలో అపారమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఎంత ధైర్యంగా, నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటే అంత త్వరగా విజయాలు మీ సొంతమవుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.

సింహ రాశి :

సింహ రాశి వారికి ఈ సంచారం చాలా అనుకూలమైన మార్పులను తెస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోయి, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

ధనుస్సు రాశి :

మకర రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదం. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు, మద్దతుతో కష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకుంటారు. సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, కెరీర్ పరంగా మీరు చేసే ప్రతీ పనిలోనూ అగ్రస్థానంలో నిలుస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks