కుజుడు ధైర్యం, కార్యదక్షత, పట్టుదల, ఉత్సాహం, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. ప్రతి గ్రహం కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుజ సంచారం

త్వరలోనే కుజుడు సంచారంలో మార్పు రాబోతోంది. కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మరి ఏ రాశుల వారికి కుజ సంచారంలో మార్పు కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశం
ఫిబ్రవరి 23న కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థిక లాభాలను పొందడంతో పాటు మరికొన్ని మార్పులను చూస్తారు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కుజ సంచారంతో ఈ రాశులకు లాభాలు
1.కన్యా రాశి
కన్యా రాశి 6వ ఇంట్లో కుజుడు సంచరించడంతో ఈ రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆస్తికి సంబంధించిన గొడవలు ఉన్నట్లయితే అవి కూడా ఈ సమయంలో తీరిపోతాయి. కోర్టు కేసుల్లో ఈ రాశి వారు విజయాన్ని అందుకుంటారు.
2.మేష రాశి
మేష రాశి 11వ ఇంట్లో కుజుడు సంచరించడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా భారీగా లాభాలను పొందుతారు. గౌరవం, మర్యాదలు పొందుతారు. అన్ని వైపుల నుంచి కూడా బాగా కలిసి వస్తుంది.
3.వృషభ రాశి
{{/usCountry}}మేష రాశి 11వ ఇంట్లో కుజుడు సంచరించడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా భారీగా లాభాలను పొందుతారు. గౌరవం, మర్యాదలు పొందుతారు. అన్ని వైపుల నుంచి కూడా బాగా కలిసి వస్తుంది.
3.వృషభ రాశి
{{/usCountry}}ఈ రాశి 10వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. దీంతో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఆకస్మిక పురోగతిని చూస్తారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఉంటుంది. ఇలా అనేక లాభాలను పొందుతారు.
4.తులా రాశి
తులా రాశి వారికి ఇది శుభ సమయం. కుజ సంచారంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల విద్య, వివాహానికి సంబంధించి కూడా మంచి మార్పులను చూస్తారు. పదవులు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
5.మకర రాశి
మకర రాశి 2వ ఇంట్లో కుజుడు సంచరించడంతో బాగా లాభాలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. షేర్లు, వ్యాపారాలు ఎక్కువ లాభాలను తీసుకువస్తాయి. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
6.ధనస్సు రాశి
ఈ రాశి 3వ ఇంట్లో కుజుడు సంచారం జరగడంతో అనేక మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తిపరంగా బాగుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.