భారతీయ వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ గ్రహాలకు సేనాధిపతిగా భావించే అంగారకుడు (కుజుడు) శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం, పరాక్రమానికి ప్రతీక. అంగారక గ్రహం తన సంచారంలో వేగాన్ని మార్చుకుని కొత్త రాశిలోకి లేదా నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రాబోయే సెప్టెంబర్ 24న అంగారకుడు శని భగవానుడికి చెందిన పుష్య నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం…. శని, అంగారక గ్రహాల శక్తులు ఈ విధంగా అనుసంధానమైనప్పుడు సమాజంలో, వ్యక్తుల జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు వేగవంతం కావడం, ఇళ్ల కొనుగోలు, స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో లాభాలు రావడం, ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ అంగారక నక్షత్ర మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో, వారికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి :
అంగారక గ్రహం నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలు లభిస్తాయి. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తి కావడం ప్రారంభిస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా ప్రణాళికపై కాలయాపన చేస్తూ నిర్ణయం తీసుకోలేకపోతుంటే, సెప్టెంబర్ 24 తర్వాత పరిస్థితులన్నీ చక్కబడి మీ వైపునకు తిరుగుతాయి. నిలిచిపోయిన వ్యవహారాలు తిరిగి ట్రాక్‌లోకి వచ్చి వేగంగా పూర్తవుతాయి. కోర్టు లేదా ఆస్తి తగాదాలకు సంబంధించిన సమస్యలు ఉంటే అవి మీకే అనుకూలంగా పరిష్కారమై భారీగా ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి :
సెప్టెంబర్ 24 నుంచి సింహ రాశి వారికి శుభ సమయం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోయి ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో మీ నాయకత్వ పటిమకు, పనితీరుకు సీనియర్ల నుంచి విశేష ప్రశంసలు దక్కుతాయి. మీ వర్కింగ్ స్టైల్‌ను ఆఫీసులో అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు, ఇవి భవిష్యత్తులో లాభదాయకమైన ఒప్పందాలకు దారితీస్తాయి. రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన చర్చలు మీకు లాభసాటిగా ముగుస్తాయి. జేబుకు చిల్లు పడకుండా, ఆర్థికంగా మునుపటి కంటే బలమైన, సౌకర్యవంతమైన స్థితికి చేరుకుంటారు.
ధనుస్సు రాశి :
{{/usCountry}}సెప్టెంబర్ 24 నుంచి సింహ రాశి వారికి శుభ సమయం ప్రారంభం కానుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోయి ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో మీ నాయకత్వ పటిమకు, పనితీరుకు సీనియర్ల నుంచి విశేష ప్రశంసలు దక్కుతాయి. మీ వర్కింగ్ స్టైల్‌ను ఆఫీసులో అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు, ఇవి భవిష్యత్తులో లాభదాయకమైన ఒప్పందాలకు దారితీస్తాయి. రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన చర్చలు మీకు లాభసాటిగా ముగుస్తాయి. జేబుకు చిల్లు పడకుండా, ఆర్థికంగా మునుపటి కంటే బలమైన, సౌకర్యవంతమైన స్థితికి చేరుకుంటారు.
ధనుస్సు రాశి :
{{/usCountry}}అంగారక గ్రహ సంచారం ధనుస్సు రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, ఇది మీ వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టే ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కంపెనీలో లేదా కార్యాలయంలో నూతన బాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార విస్తరణ కోసం కొత్త భాగస్వాములను కలుస్తారు. దీనివల్ల మీ వ్యాపారం సరైన దిశలో పయనిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
మకర రాశి :
అంగారకుడి నక్షత్ర మార్పు మకర రాశి వారికి ఊహించని శుభఫలితాలను మోసుకొస్తోంది. ఈ కాలంలో మీరు తెలివితో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయి. కెరీర్‌లో ఎదురవుతున్న అడ్డంకులు, క్లిష్ట పరిస్థితులు తొలగిపోయి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వ్యాపారంలో ఇన్నాళ్లూ ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే విధంగా కొత్త బిజినెస్ డీల్స్ కుదురుతాయి. ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్) పెట్టాలనే ఆలోచన ఉంటే… సెప్టెంబర్ 24 తర్వాత ముందడుగు వేయడం చాలా శ్రేయస్కరం.