గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. బుధుడు వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 5న రాత్రి 7:58 గంటలకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే సూర్యుడు, గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడి త్రిగ్రాహి యోగానికి దారితీస్తుంది.
ఈ యోగం ఆగస్టు 17 వరకు ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నంతకాలం ఈ యోగం కొనసాగుతుంది. ఈ 12 రోజులలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరో, ఈ రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి.
12 రోజుల పాటు త్రిగ్రాహి యోగంతో ఈ రాశుల వారికి బోలెడు లాభాలు
కొన్ని రాశుల వారికి త్రిగ్రాహి యోగం బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి వారు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది. మరి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ యోగం చాలా అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా ఇది అద్భుతమైన సమయం. భారీగా లాభాలను పొందుతారు. విద్యార్థులు చదువులో మంచి విజయాలను అందుకుంటారు.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది.
మిథున రాశి:
{{/usCountry}}ఈ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది.
మిథున రాశి:
{{/usCountry}}ఈ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ధనలాభాన్ని పొందుతారు. మధురమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. విదేశీ ప్రయాణ అవకాశాలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ప్రయోజనాలను పొందవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. మొత్తం మీద త్రిగ్రహి యోగం ఈ రాశి వారికి కూడా భారీగా లాభాలను తీసుకొస్తుంది.