బుధుడి రాశి మార్పుతో త్రిగ్రాహి యోగం.. వృషభం నుంచి వృశ్చికం వరకు ఈ రాశులకు అదృష్టం!
ఆగస్టు 5న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే అక్కడ ఉన్న సూర్యుడు, గురుడితో కలిసి శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఆగస్టు 17 వరకు కొనసాగి అన్ని రాశులపై ప్రభావం చూపనున్నప్పటికీ, ముఖ్యంగా వృషభ, మిథున, కన్య, వృశ్చిక రాశుల వారికి విశేష శుభఫలితాలను అందిస్తుంది.
గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. బుధుడు వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 5న రాత్రి 7:58 గంటలకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే సూర్యుడు, గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడి త్రిగ్రాహి యోగానికి దారితీస్తుంది.
ఈ యోగం ఆగస్టు 17 వరకు ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నంతకాలం ఈ యోగం కొనసాగుతుంది. ఈ 12 రోజులలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరో, ఈ రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి.
12 రోజుల పాటు త్రిగ్రాహి యోగంతో ఈ రాశుల వారికి బోలెడు లాభాలు
కొన్ని రాశుల వారికి త్రిగ్రాహి యోగం బాగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి వారు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది. మరి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
కన్య రాశి:
కన్య రాశి వారికి ఈ యోగం చాలా అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభిస్తారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా ఇది అద్భుతమైన సమయం. భారీగా లాభాలను పొందుతారు. విద్యార్థులు చదువులో మంచి విజయాలను అందుకుంటారు.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. శుభప్రదంగా ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది.
మిథున రాశి:
ఈ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ధనలాభాన్ని పొందుతారు. మధురమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. విదేశీ ప్రయాణ అవకాశాలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ప్రయోజనాలను పొందవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. మొత్తం మీద త్రిగ్రహి యోగం ఈ రాశి వారికి కూడా భారీగా లాభాలను తీసుకొస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


