...
...
Next Story

జీవితంలో ఈ 5 రహస్యాలను బయటపెడితే నష్టమే! చాణక్యుడి హెచ్చరిక

ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం జీవితంలో కొన్ని విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకూడదు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, మనోవేదన, కుటుంబ రహస్యాలు, మోసపోయిన విషయాలు, ఎదురైన అవమానాలు గోప్యంగా ఉంచుకోవడం మంచిది.

Published on: Aug 19, 2026, 09:30:27 IST
Advertisement

ఆచార్య చాణక్యుడిని భారతీయ చరిత్ర అత్యుత్తమ తత్వవేత్తలలో, కఠిన వాస్తవాలను బోధించిన గొప్ప మార్గదర్శకులలో ఒకరిగా కీర్తిస్తారు. ఆయన అందించిన నీతి శాస్త్రం కేవలం గ్రంథం మాత్రమే కాదు, మనిషి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం. ఒక సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఘనత చాణక్యుడి వ్యూహాలదే.

జీవితంలో ఈ 5 రహస్యాలను బయటపెడితే నష్టమే! చాణక్యుడి హెచ్చరిక
జీవితంలో ఈ 5 రహస్యాలను బయటపెడితే నష్టమే! చాణక్యుడి హెచ్చరిక

కాలం ఎంత మారినా, తరాలు మారుతున్నా చాణక్యుడి ఆలోచనలు నేటి ఆధునిక సమాజానికి కూడా పూర్తిగా వర్తిస్తాయి. మనిషి తన జీవితంలో సుఖశాంతులతో జీవించాలంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించాలని ఆయన హెచ్చరించారు.

జీవితాన్ని రక్షించే అయిదు రహస్యాలు

చాణక్యుడి మూడవ అధ్యాయంలోని మొదటి శ్లోకం ప్రకారం, ఒక మేధావి లేదా వివేకవంతుడైన వ్యక్తి ఎప్పుడూ కొన్ని విషయాలను బయటపెట్టకూడదు. ఓ శ్లోకం ద్వారా చాణక్యుడు స్పష్టం చేసిన అయిదు అంశాలు ప్రతి ఒక్కరి జీవితానికి అత్యంత కీలకం. అవేమిటో విపులంగా తెలుసుకుందాం.

1. ఆర్థిక నష్టాలు మరియు సంపాదన వివరాలు

డబ్బు కేవలం జీవనాధారమే కాదు, సమాజంలో మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టే సాధనం. మీ సంపాదన ఎంత ఉందనే విషయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఒకవేళ మీ ఆదాయం ఎక్కువగా ఉంటే సమాజంలో ఈర్ష్య పెరిగే అవకాశం ఉంది. తక్కువగా ఉంటే చులకన భావంతో చూస్తారు. అంతేకాకుండా, మీరు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలను పక్కవారితో చెబితే, వారు ఆపదలో ఆదుకోవడం కంటే మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేసే ప్రమాదం ఉంది.

2. మనోవేదన, మానసిక క్షోభ

ప్రతి కుటుంబంలోనూ చిన్నచిన్న తగాదాలు, ఇబ్బందులు ఉంటాయి. వాటిని నలుగురిలో చర్చకు పెడితే నవ్వులపాలు కావాల్సి వస్తుంది. కుటుంబంలోని అంతర్గత విషయాలను బయటపెట్టడం శత్రువులకు ఆయుధాన్ని అందించినట్టే అవుతుంది. ఇంటి గుట్టును రక్షించుకోవడమే నిజమైన కుటుంబ పెద్ద లక్షణం.

4. మోసపోవడం

జీవితంలో ఎప్పుడైనా ఎవరివల్లనైనా మోసపోయినప్పుడు, ఆ విషయాన్ని అందరితో చెప్పుకుంటూ తిరిగితే మీ తెలివితేటలపై మీకే అనుమానం కలుగుతుంది. సమాజం మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. ఆ మోసం నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్లాలి తప్ప, జరిగిన దగాను ప్రచారం చేయకూడదు.

5. ఎదురైన అవమానాలు

సమాజంలో లేదా ఉద్యోగంలో ఎప్పుడైనా తీవ్రమైన అవమానం ఎదురైతే, ఆ చేదు జ్ఞాపకాన్ని ఎవరికీ చెప్పకుండా గుండెల్లో దాచుకోవాలి. ఆ అవమానాన్నే కసిగా మార్చుకుని విజయంతో సమాధానం చెప్పాలి. అవమానాలను అందరితో పంచుకుంటే ఇతరులు మిమ్మల్ని మరింత తేలికగా తీసుకుంటారు.

ముగింపు

చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో చాలా వరకు అనవసరపు సమస్యలను నివారించవచ్చు. ఎక్కువగా మాట్లాడే స్వభావం ఉన్నవారు తమ కడుపులో దాచుకోవాల్సిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తారు. అందుకే ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో, ఏది నోరు జారకూడదో తెలుసుకోవడమే నిజమైన పరిణతి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe