New Year 2026 Remedies: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఈ మార్పులు చేస్తే.. ఏడాది అంతా విజయాలు, అదృష్టం ఇలా ఇలా అన్నీ!

New Year 2026 Remedies: 2025 పూర్తి కాబోతోంది. కొత్త సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని, అంతా మంచి జరగాలని, ఈ ఏడాది కంటే కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. మీరు కూడా కొత్త సంవత్సరం బాగా ఉండాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించాలని అనుకుంటున్నారా?  

Published on: Dec 13, 2025, 10:00:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

New Year 2026 Remedies: మరికొన్ని రోజుల్లో 2026 రాబోతోంది. 2025 పూర్తి కాబోతోంది. కొత్త సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని, అంతా మంచి జరగాలని, ఈ ఏడాది కంటే కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. మీరు కూడా కొత్త సంవత్సరం బాగా ఉండాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, లక్ష్యాలతో ప్రారంభించాలని అనుకుంటున్నారా? కుటుంబంలో ఆనందం, అభివృద్ధి, శాంతి కలగాలని భావిస్తున్నారా? అయితే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్నిటిని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వలన సానుకూల ఫలితాలు వస్తాయి.

New Year 2026 Remedies: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వీటిని ఆచరించండి.. ఇక సానుకూల ఫలితాలే (pinterest)
New Year 2026 Remedies: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వీటిని ఆచరించండి.. ఇక సానుకూల ఫలితాలే (pinterest)

కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వీటిని ఆచరించండి.. ఇక సానుకూల ఫలితాలే

ప్రతి ఒక్కరూ ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండాలని, సానుకూల శక్తి వ్యాపించాలని అనుకుంటారు. అలాంటివారు ఈ పరిహారాలను పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. 2026 అద్భుతంగా మారుతుంది.

ఉదయం ఇలా రోజు ప్రారంభించండి

లేవగానే ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత “కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం” అనే మంత్రం జపించండి. ఈ మంత్రాన్ని చదువుకుని నిద్ర లేవడం వలన దేవతల అనుగ్రహం లభిస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ రోజు సానుకూలంగా ప్రారంభమవుతుంది. ఇలా మీరు ఈ మంత్రంతో రోజును మొదలుపెడితే రోజంతా శక్తివంతంగా మారతారు, అనుకున్న పనులను పూర్తి చేయగలరు.

గాయత్రి మంత్రం, విష్ణు మంత్రం, భూమి పూజ మంత్రం కూడా జపించండి. ఇవి శుభ ఫలితాలను కలిగి, కర్తవ్యాలు విజయవంతంగా నడుస్తాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మార్పులను చేసుకుంటే సానుకూల శక్తితో పాటు శాంతి, శ్రేయస్సు కూడా కలుగుతాయి.

వీటిని కూడా ఫాలో అవ్వండి

1.తులసి మొక్క

కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పక ఉండాలి. తులసి మొక్క ఉంటే చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక తులసి మొక్కను నాటండి. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటాయి.

2.ఉప్పు నీటితో ఇంటిని క్లీన్ చేయండి

ప్రతిరోజూ ఇంటిని క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు ఆ నీళ్లలో వేయండి. ఇలా తుడవడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, ప్రతికూలత కూడా ఉండదు.

3.కర్పూరం, ధూపం

ప్రతి రోజూ ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇది ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తుంది. అలాగే ధూపపు పొగ ప్రతికూలతను తొలగించేలా పని చేస్తుంది. ఈ విధంగా పాటించినట్లయితే కొత్త సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ప్రతికూలత ఉండదు. ఆరోగ్యం కూడా ఉంటుంది. శ్రేయస్సు, శాంతిని కూడా సులభంగా పొందొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More