Vastu Shastra: పూజ గదిలో కలిసి ఉంచకూడని 4 దేవుళ్ళు, దేవతల విగ్రహాలు.. ఇలా చేస్తే తీవ్ర నష్టం కలగవచ్చు చూసుకోండి
వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడొచ్చు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు, కానీ కొంత మంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ గది విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. పూజ గదిలో పెట్టే దేవుళ్ల విగ్రహాల విషయంలో ఈ తప్పు చెయ్యద్దు.
వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడొచ్చు. అయితే, చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు, కానీ కొంత మంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ గది విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా పూజ గదిలో పెట్టే దేవుళ్ల విగ్రహాల విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

మరి, దేవుళ్ల విగ్రహాల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ గదిలో విగ్రహాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. ఇలాంటి రెండు విగ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా, ఇప్పుడే తెలుసుకోండి.
పూజ గదిలో దేవుళ్ల విగ్రహాలు
ఇంట్లో పూజ గదిలో దేవుళ్ల విగ్రహాలని పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. పూజగది ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. పూజ గది నుంచి సానుకూల శక్తి ప్రవహించేలా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే, పూజగది శుభ్రంగా ఉండాలి. దాంతో పాటుగా విగ్రహాల విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు.
1.హనుమంతుడు, శని విగ్రహాలు
పూజ గదిలో హనుమంతుడు, శని విగ్రహాలు రెండు పక్క పక్కన ఉండడం మంచిది కాదు. శని దేవుని పూజ గదిలో పెట్టాలనుకుంటే, హనుమంతుడు పక్కన పెట్టకుండా చూసుకోండి. ఈ రెండు విగ్రహాలు పక్కపక్కన ఉంటే సమస్యలు వస్తాయి, ప్రోత్సాహం తగ్గిపోతుంది. రెండు విగ్రహాల శక్తులు వేరువేరు కాబట్టి వేరుగా ఉంచాలి.
2.కాళీమాత, లక్ష్మీదేవి
పూజ గదిలోఈ రెండు విగ్రహాలు పక్క పక్కన పెట్టడం మంచిది కాదు. లక్ష్మీదేవి ప్రశాంతత, డబ్బుకి చిహ్నం. ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవాలి.
3.రెండు శివలింగాలు
శివలింగాలను పెట్టినప్పుడు రెండు శివలింగాలు పక్కపక్కన లేకుండా చూసుకోండి. అలాగే, శివలింగాన్ని ఇంట్లో పెట్టినప్పుడు రోజు బిల్వ పత్రాలను సమర్పించండి.
4.ఒకే చోట ఒకే రకమైన విగ్రహాలు పెట్టకూడదు.
పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించిన రెండు, మూడు విగ్రహాలు ఉండకూడదు, ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే ఆ విగ్రహాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.
5.పగిలిపోయిన, విరిగిపోయిన విగ్రహాలు
వాస్తు ప్రకారం పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాలు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి, సానుకూల శక్తిని తొలగిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని పూజ గది నుంచి తొలగించడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


