రేపే సంకష్టహర చతుర్థి.. పూజా విధానం, దానాలతో పాటు పఠించాల్సిన మంత్రాలు తెలుసుకోండి

సంకష్టహర చతుర్థి: సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. అలాగే చాలా మంది వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్ధి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

Published on: Dec 6, 2025, 15:00:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంకష్టహర చతుర్థి: సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని ప్రత్యేకించి పూజిస్తాము. ప్రతి నెలా కూడా కృష్ణ పక్షంలో, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన అడ్డంకులు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.

సంకష్టహర చతుర్థి (pinterest)
సంకష్టహర చతుర్థి (pinterest)

సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. అలాగే చాలా మంది వ్రతం కూడా చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్ధి నాడు వినాయక వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలిగి ఆనందంగా ఉండొచ్చు.

సంకష్టహర చతుర్థి ముహూర్తం

పంచాంగం ప్రకారం చతుర్థి తిధి డిసెంబర్ 7 సాయంత్రం 6:24కి మొదలవుతుంది. డిసెంబర్ 8న వినాయకుడిని సంకష్టహర చతుర్థి నాడు సాయంత్రం గరికతో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీన చంద్ర దర్శనం తర్వాత వినాయకుడిని ఆరాధించాలి.

సంకష్టహర చతుర్థి పూజా విధానం

  1. ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  2. ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
  3. వినాయకుడికి పువ్వులు, గరికను సమర్పించండి.
  4. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి.
  5. ధూప, దీప, నైవేద్యాలతో వినాయకుడిని ఆరాధించాలి.
  6. సాయంత్రం సంకష్ట వ్రత కథను చదివినా లేదా విన్నా మంచి ఫలితం ఉంటుంది.
  7. సాయంత్రం చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని ముగించాలి.
  8. సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని మూడు, ఐదు, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తే మంచిది.
  9. సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. అలా కుదరకపోతే "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాన్ని జపించండి.

సంకష్టహర చతుర్థి నాడు ఎలాంటి దానాలు చేస్తే మంచిది?

సంకష్టహర చతుర్ధి నాడు పేదలకు గోధుమలు, బియ్యం, పప్పులు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే పండ్లు, స్వీట్లు, దుస్తులు, దుప్పట్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. దానం చేసిన ఫలితం కలగాలంటే చేసిన దానం గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More