గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ యోగాలను ఎదుర్కొంటే, ఒక్కోసారి అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
న్యూ ఇయర్ నాడు శుభ యోగాలు

జనవరి ఒకటిన ప్రదోష వ్రతం వచ్చింది. అలాగే ఆరోజు రోహిణి నక్షత్రం, రవి యోగం, శివవాసయోగం ఏర్పడతాయి. అలాగే న్యూ ఇయర్ మొదటి రోజు పూజకు ఆదిత్య యోగం, శుక్ర యోగం ఏర్పడడం విశేషం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మకర రాశిలో సంయోగం చెందడంతో ఈ రాజయోగాలు ఏర్పడతాయి. మకర రాశికి అధిపతి అయిన శని రాశిలో ఈ యోగాలు ఏర్పడడం జరుగుతుంది.
2026 సూర్యుని సంవత్సరం. శని, సూర్యుడు రెండూ కూడా శత్రు గ్రహాలు. అలాగే నాలుగు గ్రహాలు సంయోగం చెందినప్పుడు మకర రాశిలో చాతుర్గ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో ఆనందం, సక్సెస్ ఇలా చాలా చూడొచ్చు. మరి 2026 మొదటి రోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూ ఇయర్ నాడు ఈ రాశుల వారికి పండగే.. విపరీతమైన అదృష్టం, ఆనందం.
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. గోల్డెన్ డేస్ మొదలవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కెరియర్లో మంచి మార్పులను చూస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. అలాగే ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా పూర్తవుతాయి.
2.తులా రాశి:
తులా రాశి వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈ అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగుంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అందరూ మీకు గౌరవం ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.ధనస్సు రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈ అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగుంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అందరూ మీకు గౌరవం ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.ధనస్సు రాశి:
{{/usCountry}}ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ ఆనందం పెరుగుతుంది.