మహాభారత సమయంలో, పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వ్యాస మహర్షి వారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో భీముడు వ్యాసుడితో తన బాధను పంచుకుంటాడు. "స్వామీ, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరూ ఏకాదశి వ్రతం నియమబద్ధంగా పాటిస్తారు. కానీ, నా కడుపులో 'వృకోదర' అనే అగ్ని ఉంది. నాకు ఆకలిని తట్టుకోవడం అసాధ్యం. ఆహారం తీసుకోకుండా ఏకాదశి చేయడం నాకు సాధ్యపడదు. అలాగని పుణ్యాన్ని వదులుకోలేను. ఏడాదిలో ఒక్క రోజైనా నేను ఆచరించగలిగే, నాకు మోక్షాన్ని ప్రసాదించే ఏదైనా వ్రతం చెప్పండి" అని వేడుకుంటాడు.
వ్యాసుడి సూచన - భీమసేనుడికి పరిష్కారం

భీముడి ఆవేదనను అర్థం చేసుకున్న వ్యాస మహర్షి, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరిస్తారు. "భీమా, నువ్వు ఏడాది పొడవునా ఉపవాసం ఉండనవసరం లేదు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఈ 'నిర్జల ఏకాదశి' వ్రతాన్ని ఆచరించు. ఆ ఒక్క రోజు చేసే వ్రతం, ఏడాదిలో చేసే మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్యఫలాన్ని నీకు అందిస్తుంది" అని చెబుతారు. అప్పటి నుండి భీముడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీనికి 'పాండవ ఏకాదశి' లేదా 'భీమ ఏకాదశి' అనే పేరు వచ్చింది.
ఎలా ఆచరించాలి? నియమాలివే!
ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఎంతో నిష్ఠగా వ్యవహరించాలి.
నిర్జల దీక్ష: ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని కూడా తీసుకోకూడదు. కేవలం ఆచమనం కోసం మాత్రమే కొద్దిగా నీటిని తీసుకోవాలి.
దానధర్మాలు: ఈ రోజున నీటితో నిండిన కలశాలను, చక్కెరను బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో శ్రేష్ఠం. అలాగే వస్త్రాలు, గోదానం, చెప్పులు, గొడుగు వంటివి దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం.
భగవత్ ఆరాధన: ఈ రోజంతా శ్రీహరిని స్మరిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, రాత్రిపూట జాగరణ చేయడం చాలా మంచిది.
{{/usCountry}}భగవత్ ఆరాధన: ఈ రోజంతా శ్రీహరిని స్మరిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, రాత్రిపూట జాగరణ చేయడం చాలా మంచిది.
{{/usCountry}}పారణ: ద్వాదశి రోజున స్నానానంతరం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణాంబూలాలు సమర్పించి, ఆ తర్వాతే మనం భోజనం చేయాలి.
ఈ వ్రత మహిమ ఏంటి?
నిర్జల ఏకాదశిని నియమ నిష్ఠలతో పాటించిన వారికి, వారు చేసిన పాపాలన్నీ నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ వ్రత కథను భక్తితో విన్నా, చదివినా సూర్యగ్రహణ సమయంలో పవిత్ర నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తమ గత వంద తరాల వారికి, రాబోయే వంద తరాల వారికి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తారని వ్యాస మహర్షి భీముడికి వివరించారు.
ద్వాదశి రోజున ఏం చేయాలి?
ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి, వారిని తృప్తి పరిచిన తర్వాతే భోజనం చేయడం ఈ వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం.