ఎండిన తులసి మొక్కను పారేస్తున్నారా? ఈ చిన్న పనులతో అపార పుణ్యం!

తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా ఎంతో పవిత్రమైనది. ఎండిన తులసి కొమ్మలు, ఆకులను బయట పారేయకుండా ఎలాంటి పరిహారాలు చేయాలో, వాటి వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎలా లభిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 9, 2026, 11:00:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావిస్తారు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినట్లయితే మీరు బాధపడకండి. ఎండిపోయిన తులసి మొక్క కూడా అంతే పవిత్రమైనది.

ఎండిన తులసి మొక్కను పారేస్తున్నారా? ఈ చిన్న పనులతో అపార పుణ్యం! (pinterest)
ఎండిన తులసి మొక్కను పారేస్తున్నారా? ఈ చిన్న పనులతో అపార పుణ్యం! (pinterest)

తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని, విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టమని విశ్వసిస్తారు. తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించడం మంచిది కాదు. అలాగే, తెలియక గానీ తెలిసి గానీ తులసి మొక్కకు సంబంధించిన తప్పులు చేయకూడదు. అలా చేస్తే విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగి ఇబ్బందులు రావచ్చు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోయినట్లయితే దానిని పారేయకండి. ఈ పరిహారాలను పాటించచ్చు. ఆధ్యాత్మికంగా తులసి మొక్కను ఎండిపోయిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి?

ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దానిని పారేయక్కర్లేదు. ఎక్కడపడితే అక్కడ పారేయడం వలన తీవ్రమైన దోషాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి. తులసి మొక్క ఎండిపోతే ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ పరిహారాలను పాటించచ్చు. కానీ పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయద్దు. ప్రతికూల శక్తులు పెరిగే అవకాశం ఉంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. తులసి మొక్కను గౌరవంగా ప్రవహించే నదిలో లేదా పవిత్ర జలాల్లో కలపడం మంచిది. అలాగే ఈ పరిహారాలను కూడా పాటించొచ్చు.

తులసి మాల

ఎండిపోయిన తులసి కొమ్మలను శుభ్రం చేసి, గంగాజలంతో శుద్ధి చేసి తులసి మాలను తయారు చేసుకుని మెడలో వేసుకోవచ్చు. తులసి మాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది మనసును ప్రశాంతంగా మార్చడంతో పాటు చెడు ఆలోచనలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ మాలను ధరించేటప్పుడు మాత్రం కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి.

ప్రధాన ద్వారం

ఎండిపోయిన తులసి కొమ్మలను ఎర్ర వస్త్రంలో చుట్టి ప్రధాన ద్వారానికి తగిలించండి. దీని వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. దుష్టశక్తులు ఇంట్లోకి రావు. ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

తులసి కాడలతో దీపం

తులసి కాడలతో దీపాలను వెలిగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ తులసి కాడతో దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దరిద్రం తొలగిపోతుంది. దీపాన్ని వెలిగించిన తర్వాత ఇల్లంతా చూపించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది. సుఖసంతోషాలు కలుగుతాయి.

పూజ గదిలో

పూజ గదిలో ఎండిపోయిన తులసి ఆకులను, కొమ్మలను ఎర్రటి వస్త్రంలో పెట్టి ఉంచండి. ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగి ప్రశాంతంగా ఉండొచ్చు.

హోమాలు, యజ్ఞాలు

హోమాలు, యజ్ఞాలు చేసినప్పుడు ఎండిన తులసి కొమ్మలను హవిస్సుగా వాడుకోవచ్చు. తులసిని సమర్పిస్తే దేవతలు సంతోషించి ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More