Tulasi: తులసి దళాలు అందరికీ అర్పించకూడదా? పొరపాటున ఈ దేవుళ్లకు ఉపయోగిస్తే కష్టాలు తప్పవు!
Tulasi: తులసి దళాలు అందరికీ అర్పించకూడదా? హిందూ సంప్రదాయంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. కానీ ఏ దేవుడికి తులసి దళాలు అర్పించకూడదు? తులసిని కోసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? ఆసక్తికర విషయాలు మీకోసం.
తులసి మొక్క అనేది కేవలం ఒక మొక్కగా కాదు, మన హిందూ ధర్మంలో సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము. విష్ణువుకి కూడా తులసి అంటే ఎంతో ప్రీతి. విష్ణువుకి పూజ చేసేటప్పుడు తులసి లేకుండా పూజ సంపూర్ణం అవ్వదు. పూజల్లో మనం తులసి దళాలను వాడుతూ ఉంటాము. అయితే తులసి దళాలను పూజల్లో ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం కూడా ఎంతో ముఖ్యం.

భక్తితో తులసి దళాలను దేవుళ్లకి సమర్పిస్తే కుదరదు. కొన్ని పూజల్లో తులసి దళాలను ఏమాత్రం ఉపయోగించకూడదు. తులసి దళాలను ఈ దేవుళ్లకు సమర్పిస్తే ఫలితం తగ్గిపోతుంది. మరి తులసి దళాలను ఏ దేవుళ్లకి సమర్పించకూడదు? ఈ నియమాల వెనుక కథ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
పొరపాటున కూడా ఈ దేవుళ్లకు తులసి దళాలను సమర్పించకండి
1.వినాయకుడు
విఘ్నాలు తొలగించే వినాయకుడిని మొట్టమొదట మనం పూజిస్తాము. అయితే వినాయకుడికి అన్ని రకాల పత్రాలు, పుష్పాలు ఇష్టమే. కానీ తులసిని మాత్రం వినాయకుడి పూజలో ఉపయోగించకూడదు. దీని వెనుక పౌరాణిక కథ కూడా ఉంది.
వినాయకుడుకి తులసిని ఎందుకు సమర్పించకూడదు? దీని వెనుక కథ ఇదే!
ఓ నాడు తులసి గంగానది తీరంలో తపస్సు చేస్తున్నప్పుడు గణేష్‌ని చూసి మోహించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ బ్రహ్మచారి అయినటువంటి వినాయకుడు నిరాకరించాడు. కోపం వచ్చిన తులసి ఆయనకు శాపాన్ని ఇస్తుంది. ప్రతిగా గణేశుడు కూడా శపించాడు. “నీ దళాలను నా పూజలో పొరపాటున కూడా ఉపయోగించకూడదు” అని ఆజ్ఞాపిస్తాడు. అందుకని తులసి దళాలను వినాయకుడి పూజలో సమర్పించరు. తులసితో వినాయకుడికి పూజ చేయకూడదు. అలాగే వినాయక చవితి నాడు 21 రకాల ఆకులతో మనం పత్ర పూజ చేస్తూ ఉంటాము. అందులో కూడా తులసిని వాడము.
2.శివుడు
పరమశివుడికి కూడా సమర్పించకూడదు. శివపూజలో బిల్వపత్రాలకు ఉన్న ప్రాధాన్యత తులసికి ఏ మాత్రం లేదు.
శివుడుకి తులసిని ఎందుకు సమర్పించకూడదు? దీని వెనుక కథ ఇదే!
శివపురాణం ప్రకారం చూసినట్లయితే, పూర్వజన్మలో తులసి ధర్మధ్వజుడి కూతురు బృంద. ఆమె రాక్షసరాజైనటువంటి శంఖచూడుడిని పెళ్లి చేసుకుంటుంది. అతను లోకాలను పీడిస్తున్నప్పుడు శివుడు అతన్ని సంహరిస్తాడు. భర్తను చంపాడని తులసి శివుని అంగీకరించదు. అందుకని శివుడికి తులసి దళాలను సమర్పించము. అయితే కొన్నిసార్లు కార్తీకమాసంలో కొన్ని ప్రాంతాలలో దీనికి మినహాయింపులు ఉన్నాయి. సాధారణ పూజలో మాత్రం శివలింగానికి తులసి దళాలను సమర్పించకూడదు.
తులసి దళాలను కోసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
- తులసి దళాలను కోసేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి. పొరపాటున కూడా తులసి దళాలను ఈ రోజుల్లో కోయకండి.
- ఆదివారం, ఏకాదశి, ద్వాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి దళాలను కోయకూడదు. ఈ సమయాల్లో కోయడం మంచిది కాదు.
- సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట తులసిని కోయకూడదు. అది మహాపాపంగా భావిస్తారు.
- స్నానం చేయకుండా, పవిత్రంగా లేనప్పుడు కూడా తులసి మొక్కని ముట్టుకోకూడదు. తులసి దళాలను కోయకూడదు.
- ఇతర పుష్పాలు వాడిపోతే పూజకు పనికిరావు. కానీ తులసి దళాలు ఎండిపోయినా పవిత్రత ఏ మాత్రం తగ్గదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


