శివుడికి ఈ 4 రాశుల వారంటే ఎంతో ప్రీతీ.. శివయ్య అనుగ్రహంతో అతి పెద్ద కష్టాన్ని కూడా సులభంగా దాటేస్తారు!
శివుని అనుగ్రహం ఉంటే కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారంటే శివుడికి ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ ఈ రాశుల వారికి శివుని అనుగ్రహం ఉంటుంది. దాంతో ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది?
శివుడుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, శివుని అనుగ్రహం ఉంటే కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. అయితే త్వరలోనే శివరాత్రి రాబోతోంది. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం, శివరాత్రి నాడు జాగారం చేయడం వంటి రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. వీటిని పాటించడం వలన మహా శివుని ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారంటే శివుడికి ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ ఈ రాశుల వారికి శివుని అనుగ్రహం ఉంటుంది. దాంతో ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు.. ఎలాంటి కష్టాలైనా సులువుగా దాటేస్తారు
కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎల్లప్పుడూ శివుని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. శివుడు తన శిరస్సుపై చంద్రుడిని ధరిస్తాడు. అందువల్ల ఎప్పుడూ శివుడు ఈ రాశి వారిని రక్షిస్తాడు. కష్టాలను సులువుగా దాటేస్తారు. కర్కాటక రాశి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎవరైనా బాధపడితే దానిని అంత త్వరగా మరిచిపోలేరు.
తులా రాశి:
తులా రాశి వారు కూడా ఎల్లప్పుడూ శివుని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ రాశి వారు కూడా ఎల్లప్పుడూ శివుని ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. తులా రాశి వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి హాబీలు, వారి కోరికల కోసం డబ్బును ఖర్చు పెట్టడానికి ఆలోచించరు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
మకర రాశి:
మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారికి కూడా శివుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తారు. కష్టాన్ని నమ్ముకుంటారు కానీ అదృష్టాన్ని నమ్ముకోరు. వారు ఏ రంగంలోకి అడుగుపెట్టినా ఆ రంగంలో సక్సెస్‌ను అందుకుంటారు. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా శివుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కుంభ రాశి వారిని శివుడు రక్షిస్తాడు. ఈ రాశి వారి జీవితంలో సంతోషం, డబ్బు ఉండేటట్లు చూస్తాడు. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. పెద్ద సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


