మరో పది రోజుల్లో సూర్య, రాహువుల గ్రహణ యోగం.. 4 రాశుల వారికి సమస్యలు.. ఈ పరిహారాలను పాటిస్తే మంచిది!
ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో ఉండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. దాంతో అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు కలుగుతాయి. దీంతో ఒక్కసారిగా జీవితం కూడా మారిపోతుంది. మరి కొన్ని రోజుల్లో, అంటే ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో సంచారం చేయడంతో సూర్య, రాహువుల సంయోగం ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. మార్చి మధ్య వరకు ఈ యోగం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది.

సూర్య, రాహువుల కలయిక
ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో ఉండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారు ఈ గ్రహణ యోగం వలన సమస్యలను ఎదుర్కొంటారు? ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణ యోగంతో ఈ రాశుల వారికి సమస్యలు.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదు. ఖర్చులు కూడా సడన్‌గా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాచుకున్న డబ్బులను కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. పాలిటిక్స్‌కు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ శత్రువులు ఈ సమయంలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందుల నుంచి బయట పడడానికి కన్యా రాశి వారు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచిది.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ యోగంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏకాగ్రతతో నడపడం మంచిది. ఈ సమయంలో సమస్యలు తగ్గి సంతోషంగా ఉండాలంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలను రోజూ పఠించండి.
4.మీన రాశి:
మీన రాశి వారికి సూర్య, రాహువుల కలయికతో ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సమస్యలను తగ్గించుకోవాలంటే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


