ప్రతి నెలలో కూడా కొన్ని పండుగలు, ముఖ్యమైన పర్వదినాలు వంటివి ఉంటాయి. వాటిని చూసుకుని మనం దానికి తగ్గట్టుగా వ్రతాలను, ఉపవాసాలను, పండుగలను జరుపుకుంటూ ఉంటాము.

నవంబర్ నెలలో కూడా కొన్ని ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు వచ్చాయి. నవంబర్ నెలలో దీపావళి, నాగుల చవితితో పాటుగా కొన్ని ముఖ్యమైన పండుగలు, ఏకాదశులు, ద్వాదశి, పున్నమి వంటివి వచ్చాయి. వాటి వివరాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు పంచాంగం ఆధారంగా ఆ ప్రధాన పండుగల తేదీలు, ముఖ్యమైన రోజులను ఇక్కడ చూడొచ్చు.
నవంబర్ 1, 2026, ఆదివారం: అహోయి అష్టమి.
నవంబర్ 5, 2026 గురువారం: రమా ఏకాదశి.
నవంబర్ 6, 2026 శుక్రవారం: ధన త్రయోదశి, ప్రదోష వ్రతం.
నవంబర్ 7, 2026 శనివారం: మాస శివరాత్రి.
నవంబర్ 8, 2026 ఆదివారం: దీపావళి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ.
నవంబర్ 11, 2026 బుధవారం: భాయ్ దూజ్
నవంబర్ 13, 2026 శుక్రవారం: నాగుల చవితి.
నవంబర్ 15, 2026 ఆదివారం: స్కంద షష్ఠి.
నవంబర్ 16, 2026 సోమవారం: వృశ్చిక సంక్రాంతి, కార్తీక సోమవారం.
నవంబర్ 20, 2026 శుక్రవారం: దేవుత్థాన ఏకాదశి, కార్తీక ఏకాదశి.
నవంబర్ 21, 2026 శనివారం: తులసి వివాహం, క్షీరాబ్ధి ద్వాదశి.
నవంబర్ 22, 2026 ఆదివారం: ప్రదోష వ్రతం.
నవంబర్ 24, మంగళవారం: కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి, గురునానక్ జయంతి.
నవంబర్ 27, శుక్రవారం: సంకష్టహర చతుర్థి.
రమా ఏకాదశి నాడు భక్తులు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటారు. విష్ణు నామస్మరణ, ధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}రమా ఏకాదశి నాడు భక్తులు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉంటారు. విష్ణు నామస్మరణ, ధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}అలాగే, నవంబర్ 6న ధన త్రయోదశి చాలా విశేషమైనది. ఆరోజు లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తే సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. శివుడిని ఆరాధించడం వలన శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.
ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మాస శివరాత్రి నాడు శివుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము. ఆ రోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
అలాగే, నవంబర్ 13న వచ్చే నాగుల చవితి చాలా విశేషమైనది. కుటుంబం కోసం నాగుల చవితి నాడు పుట్ట దగ్గర పూజలు చేస్తారు.
నవంబర్ 15న స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన ఫలితాలను చూడొచ్చు. శుభం, ధైర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.
క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి మొక్కను విష్ణు స్వరూపమైన సాలగ్రామంతో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరుపుతారు. ఆరోజు ఇలా పూజ చేయడం వలన దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి నవంబర్ 24న వచ్చింది. ఆ రోజు శివకేశవులను పూజిస్తే విశేషమైన ఫలితాలను చూడొచ్చు.
నవంబర్ 27న సంకటహర చతుర్థి. ఆ రోజు వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగిపోతాయి.