గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి గ్రహాల కారణంగా శుభఫలితాలు కలిగితే, మరోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. శుక్రుడు సంతోషాలు, ప్రేమ, అందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడిగా చెబుతారు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు నీచరాశి అయినటువంటి కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 22న స్వరాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడితో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడడం విశేషం.
మాలవ్య రాజయోగం ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. పదోన్నతులు, ఉద్యోగంలో లాభాలు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాజయోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? వంటి వివరాలను చూసేద్దాం.
తులారాశిలోకి శుక్రుడు.. మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అదృష్టం!
శుక్రుడు నవంబర్ 22న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 1, 2027 వరకు అదే రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
తులా రాశి
తులా రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. మాలవ్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు గౌరవ మర్యాదలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులా రాశి వారు ఈ సమయంలో మంచి గుర్తింపును, గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాలవ్య రాజయోగం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది.
మేష రాశి
మేష రాశి వారికి కూడా ఈ రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.మాలవ్య రాజయోగంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్యాపార ప్రణాళికల్లో లాభాలు ఉంటాయి. అలాగే మంచి డీల్ కుదురుతుంది. వ్యాపారులకు అవకాశాలు లభించి, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం మరింత పెరుగుతుంది. అన్ని విధాలుగా ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
కన్యా రాశి
{{/usCountry}}మేష రాశి వారికి కూడా ఈ రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.మాలవ్య రాజయోగంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్యాపార ప్రణాళికల్లో లాభాలు ఉంటాయి. అలాగే మంచి డీల్ కుదురుతుంది. వ్యాపారులకు అవకాశాలు లభించి, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం మరింత పెరుగుతుంది. అన్ని విధాలుగా ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
కన్యా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి కూడా ఈ రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. శుక్రుడి కారణంగా ఏర్పడే ఈ మాలవ్య రాజయోగం కన్యారాశి వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి తిరిగి వస్తుంది. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే, ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా చూసుకోవడం మంచిది.