నవంబర్ 22 నుంచి ఈ 3 రాశుల జాతకం మారబోతోందా? ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, అందమైన వైవాహిక జీవితంతో పాటు ఇన్ని లాభాలా?
నవంబర్ 22న శుక్రుడు తన స్వరాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. 2027 జనవరి 1 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడి ఈ రాశి మార్పుతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడితో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడనుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి గ్రహాల కారణంగా శుభఫలితాలు కలిగితే, మరోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. శుక్రుడు సంతోషాలు, ప్రేమ, అందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడిగా చెబుతారు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు నీచరాశి అయినటువంటి కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 22న స్వరాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడితో కలిసి లక్ష్మీనారాయణ రాజయోగం కూడా ఏర్పడడం విశేషం.
మాలవ్య రాజయోగం ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. పదోన్నతులు, ఉద్యోగంలో లాభాలు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రాజయోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? వంటి వివరాలను చూసేద్దాం.
తులారాశిలోకి శుక్రుడు.. మాలవ్య రాజయోగంతో ఈ రాశుల వారికి అదృష్టం!
శుక్రుడు నవంబర్ 22న తులారాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 1, 2027 వరకు అదే రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
తులా రాశి
తులా రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. మాలవ్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు గౌరవ మర్యాదలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తులా రాశి వారు ఈ సమయంలో మంచి గుర్తింపును, గౌరవ మర్యాదలను కూడా పొందుతారు. అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మాలవ్య రాజయోగం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది.
మేష రాశి
మేష రాశి వారికి కూడా ఈ రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.మాలవ్య రాజయోగంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్యాపార ప్రణాళికల్లో లాభాలు ఉంటాయి. అలాగే మంచి డీల్ కుదురుతుంది. వ్యాపారులకు అవకాశాలు లభించి, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం మరింత పెరుగుతుంది. అన్ని విధాలుగా ఈ సమయంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి కూడా ఈ రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. శుక్రుడి కారణంగా ఏర్పడే ఈ మాలవ్య రాజయోగం కన్యారాశి వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి తిరిగి వస్తుంది. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే, ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా చూసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


