న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కొన్ని ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. ఈ లైఫ్ పాత్ నెంబర్ కలిగిన మహిళలు తమ భాగస్వాముల పట్ల ఎంతో ప్రేమ, ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా భాగస్వామికి అండగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రేమికుడైనా, భర్త అయినా సరే తమ భాగస్వామిని అపారంగా ప్రేమిస్తారు.
లైఫ్ పాత్ నెంబర్, డెస్టిని నెంబర్‌లను ఎలా లెక్కించాలి?
డెస్టిని నెంబర్‌ను తేదీ, నెల, సంవత్సరం సంఖ్యలను కలిపి లెక్కిస్తారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి లైఫ్ పాత్ నెంబర్ 2 అవుతుంది.
లైఫ్ పాత్ నెంబర్‌ను ఇలా లెక్కించాలి
ఎవరైనా మార్చి 29, 1999న పుట్టినట్లయితే:
తేదీ 29 2+9 = 11 1+1 = 2
నెల 3
సంవత్సరం 1999.. 1+9+9+9 = 28.. 2+8 = 10.. 1+0 = 1
ఇప్పుడు మొత్తం అన్నీ కలిపితే:
2 + 3 + 1 = 6
అంటే, వారి డెస్టిని నెంబర్ 6 అవుతుంది.
లైఫ్ పాత్ నెంబర్ 2
లైఫ్ పాత్ నెంబర్ 2 ఉన్న మహిళలు చాలా నమ్మకస్తులు. లైఫ్ పాత్ నెంబర్ 2 లేదా డెస్టిని నెంబర్ 2 కలిగిన మహిళలు ఎప్పుడూ విశ్వాసంగా ఉంటారు. కష్ట సమయంలో కూడా భర్తను ఏ మాత్రం వదిలిపెట్టరు. సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటారు. ఈ సంఖ్యకు చెందిన వారు ఉత్తమ భాగస్వాములు అని చెప్పచ్చు.
చంద్రుడి ప్రభావం
{{/usCountry}}లైఫ్ పాత్ నెంబర్ 2 ఉన్న మహిళలు చాలా నమ్మకస్తులు. లైఫ్ పాత్ నెంబర్ 2 లేదా డెస్టిని నెంబర్ 2 కలిగిన మహిళలు ఎప్పుడూ విశ్వాసంగా ఉంటారు. కష్ట సమయంలో కూడా భర్తను ఏ మాత్రం వదిలిపెట్టరు. సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటారు. ఈ సంఖ్యకు చెందిన వారు ఉత్తమ భాగస్వాములు అని చెప్పచ్చు.
చంద్రుడి ప్రభావం
{{/usCountry}}సంఖ్య 2కు అధిపతి చంద్రుడు. చంద్రుడి ప్రభావం ఉండడంతో ఈ మహిళలు భావోద్వేగపరులు, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. భాగస్వామిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. మోసాన్ని కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు సహించలేరు. అందువల్ల ప్రేమలో సులభంగా మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు వారి మనసుకు ఎంతో బాధ కలిగిస్తాయి.
అనుకూలమైన సంఖ్యలు
లైఫ్ పాత్ లేదా డెస్టిని నెంబర్ 2 కలిగిన మహిళలకు 1, 3, 5, 6, 7 సంఖ్యల లైఫ్ పాత్ నెంబర్ కలిగిన వారు మంచి భాగస్వాములుగా ఉంటారు. వీరికి వారు చాలా అనుకూలంగా ఉంటారు. సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారు. ఎప్పుడైనా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు లైఫ్ పాత్, డెస్టిని నెంబర్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.