Numerology: మీ పుట్టిన తేదీలోనే సంపద రహస్యం.. ఏ నంబర్ వారు ఎలా కష్టపడితే కోటీశ్వరులవుతారో తెలుసా?

Numerology: మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? కెరీర్‌లో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదా? అయితే మీ పుట్టిన తేదీ (రాడిక్స్ సంఖ్య) ఆధారంగా న్యూమరాలజీ చెప్పే ఈ రహస్యాలను పాటించండి. ఏ నంబర్ వారు ఏ రంగంలో రాణిస్తారు, ధనవంతులు కావడానికి ఏం చేయాలో పూర్తి వివరాలు మీకోసం.    

Published on: May 6, 2026, 08:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Numerology: న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

Numerology: మీ పుట్టిన తేదీలోనే సంపద రహస్యం (pinterest)
Numerology: మీ పుట్టిన తేదీలోనే సంపద రహస్యం (pinterest)

పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో పైకి రావాలని, అనుకున్న వాటిని సాధించాలని, డబ్బు సంపాదించాలని ఇలా ఎన్నో అనుకుంటారు. మీరు కూడా కెరీర్‌లో బాగా స్థిరపడేలా, డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోవాల్సిందే. రాడిక్స్ సంఖ్య ఆధారంగా డబ్బును ఆకర్షించడానికి ఎలాంటి పద్ధతులను పాటించాలో తెలుసుకోండి.

రాడిక్స్ సంఖ్య 1:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్, పాలిటిక్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించగలరు. అలాగే డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. మీరు ఒకరి కింద పని చేస్తే మీ వద్ద ఎప్పుడూ డబ్బు ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 2:

ఏదైనా నెలలో 2, 11, 20 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు నెట్‌వర్కింగ్, పార్ట్‌నర్‌షిప్ ద్వారా బాగా డబ్బు సంపాదించగలరు. ఒంటరిగా పనిచేయడం వలన అభివృద్ధి నెమ్మదిగా వస్తుంది.

రాడిక్స్ సంఖ్య 3:

ఏదైనా నెలలో 3, 12, 21 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. మాట్లాడడంలో మీరు మంచి ప్రతిభ కలిగినవారు. టీచింగ్, మీడియా, క్రియేటివ్ రంగాల్లో బాగా రాణించగలరు. మీ టాలెంట్‌ను మీరు ఉపయోగించకపోతే సక్సెస్ అవ్వలేరు.

రాడిక్స్ సంఖ్య 4:

ఏదైనా నెలలో 4, 13, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. టెక్నికల్ ఫీల్డ్‌లో వీరు బాగా రాణించగలరు. త్వరగా ధనవంతులు అవ్వాలంటే షార్ట్‌కట్‌లో సంపాదించాలన్న ఆలోచన పక్కన పెట్టండి. షార్ట్‌కట్స్‌కు దూరంగా ఉండండి.

రాడిక్స్ సంఖ్య 5:

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. వ్యాపారం, ట్రేడింగ్, మార్కెటింగ్, ఆన్‌లైన్ పనుల ద్వారా ఆదాయాన్ని బాగా సంపాదిస్తారు. పని చేయకుండా కేవలం ప్లాన్లు మాత్రమే వేసినట్లయితే చివరికి ఖాళీ చేతులతో మిగిలిపోవాల్సి ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 6:

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఫ్యాషన్, బ్యూటీ, గ్లామర్ రంగాల్లో బాగా డబ్బు సంపాదిస్తారు. ఖరీదైన అలవాట్లు, సౌకర్యాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దాంతో డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 7:

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. ఫ్రీలాన్సింగ్, రీసెర్చ్, ఆధ్యాత్మికత, టెక్నాలజీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. కష్టకాలాల్లో అవకాశాలను గుర్తించి ధనవంతులు అవుతారు. ప్రతి విషయాన్ని త్వరగా సాధించాలని భావించడం ద్వారా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

రాడిక్స్ సంఖ్య 8:

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. 8 సంఖ్య వారు చాలా ధనవంతులు అవ్వచ్చు, కానీ దీనికి కఠిన శ్రమ, పోరాటం చాలా ముఖ్యం. వీరికి లభించే సంపద స్థిరంగా, దీర్ఘకాలం పాటు ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 9:

ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. లీడర్‌షిప్, ఇన్వెస్ట్మెంట్, క్రీడలు వంటి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More