Numerology: ఓవర్ నైట్ అదృష్టం మీ సొంతం కావాలా? ఈ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం పక్కా.. న్యూమరాలజీ ఏం చెబుతోంది?

Numerology: న్యూమరాలజీ ప్రకారం మన పుట్టిన తేదీ మన భవిష్యత్తును శాసిస్తుంది. కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం దక్కక నిరాశ చెందుతుంటారు. కానీ, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి విజయం అనేది ఒక్కసారిగా, హఠాత్తుగా వరిస్తుంది. ఆ అదృష్టవంతులు ఎవరో, వారి జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో  తెలుసుకోండి.

Published on: May 1, 2026, 14:00:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారు ఒక్క విధంగా ఉంటారు. కొన్ని సంఖ్యల వారికి డబ్బుకు లోటు ఉండదు, ఆర్థికపరంగా ఎప్పుడూ బాగానే ఉంటుంది.

Numerology: ఓవర్ నైట్ అదృష్టం మీ సొంతం కావాలా? ఈ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం పక్కా (pinterest)
Numerology: ఓవర్ నైట్ అదృష్టం మీ సొంతం కావాలా? ఈ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం పక్కా (pinterest)

మీరు కష్టపడి కష్టపడి అలసిపోయారా? అయినా సరే ఫలితాలు కనిపించట్లేదా? అయితే మీరు కూడా వీరిలో ఒకరు. ఈ తేదీల్లో పుట్టిన వారు హఠాత్తుగా సక్సెస్‌ని చూస్తారు. కష్టపడినప్పటికీ ఫలితం రాదని చింతించకండి. కొంత మంది లైఫ్‌లో త్వరగా సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఒక్క రాత్రిలో ఈ తేదీల్లో పుట్టిన వారి అదృష్టం మారిపోతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక్కసారిగా సక్సెస్ వస్తుంది.. మరి వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి

రాడిక్స్ సంఖ్యలు:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. అలాగే 3, 12, 21 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది.

రాడిక్స్ సంఖ్య 1: రాజు అవ్వడానికి పుడతారు

రాడిక్స్ సంఖ్య 1 వారు రాజులా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 22 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

రాడిక్స్ సంఖ్య 3: చాలా తెలివైన వారు

3 సంఖ్య వారు చాలా తెలివైన వారు. ఈ తేదీల్లో పుట్టిన వారు 32 నుంచి 35 సంవత్సరాల మధ్య సక్సెస్‌ను చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వస్తారు, కానీ సక్సెస్ వారి వెంట ఉంటుంది. హఠాత్తుగా వారికి ఊహించని విధంగా సక్సెస్ వస్తుంది.

రాడిక్స్ సంఖ్య 9: ధైర్యవంతులు

రాడిక్స్ సంఖ్య 9 వారు చాలా ధైర్యవంతులు. పైగా కష్టపడి పని చేస్తారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి కాస్త కోపం కూడా ఎక్కువే. గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక్కసారిగా ఊహించని సక్సెస్ వారికి వస్తుంది. స్పోర్ట్స్, సెక్యూరిటీ, మిలిటరీ రంగాల్లో బాగా రాణిస్తారు.

ఈ రాడిక్స్ సంఖ్యల్లో మీరు ఉంటే కచ్చితంగా ప్రయత్నాన్ని ఆపకండి. కష్టపడి పని చేయండి. కచ్చితంగా సక్సెస్ ఆలస్యంగా వస్తుంది, కానీ అది జీవితాంతం మిమ్మల్ని సంతోషంగానే ఉంచుతుంది, ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More