...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు అత్తింటికి లక్ష్మీదేవులు.. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సంతోషం, డబ్బు ఉంటాయి!

న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ప్రతి రాడిక్స్ సంఖ్యకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటి వారికి లక్ష్మీదేవులు. బంధాలకు, ప్రేమకు ఎక్కువ విలువను ఇస్తారు. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

Published on: Jan 7, 2026, 12:00:13 IST
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. అలాగే ప్రతి రాడిక్స్ సంఖ్యకు కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం అత్తింటి వారికి లక్ష్మీదేవులు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు బంధాలకు, ప్రేమకు ఎక్కువ విలువను ఇస్తారు. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అందరి మనసును గెలుచుకుంటారు.. అత్తింటికి లక్ష్మీదేవులు అవుతారు

రాడిక్స్ సంఖ్య 3

ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు అత్తింటికి లక్ష్మీదేవులు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు అత్తింటికి లక్ష్మీదేవులు (pinterest)

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. జ్ఞానం, ధర్మం, విజ్ఞానం మొదలైన వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు.

నిజాయితీకి, నమ్మకానికి విలువ ఇస్తారు

చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు, స్టేటస్ వంటి వాటిని చూసి ఇష్టపడితే, ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం నిజాయితీ, నమ్మకం, ఇలా వీటిని చూసి ఇష్టపడతారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ కూడా భాగస్వామికి కట్టుబడి ఉంటారు. భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.

కష్టపడి అన్నింటినీ పొందుతారు

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు. అలాగే చక్కగా ఆలోచిస్తారు. విద్య, కెరీర్‌లో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కష్టపడి, తెలివితేటలతో అన్నిటినీ వారి సొంతం చేసుకుంటారు. వీరికి మాట్లాడే నైపుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇతరులను ప్రభావితం చేస్తారు. వారి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు.

ఈ అమ్మాయిలు లక్ష్మీదేవులు

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ సంఖ్య మూడు‌కు చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. కేవలం భాగస్వామి అదృష్టాన్ని పెంపొందించడమే కాకుండా, వారి కుటుంబాన్ని అంతటినీ కూడా మంచి మార్గంలోకి వెళ్లేలా చూస్తారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe